తెలంగాణ

telangana

ETV Bharat / state

చూసి కంటెయినర్​ అనుకున్నారా? కాదు మోడ్రన్ హాస్పిటల్ - MOBILE MINI HOSPITAL IN ADILABAD

నాగోబా జాతరలో మల్టీ స్పెషల్‌ డయాగ్నస్టిక్‌ సంచార వైద్యశాల - రక్త, మూత్ర పరీక్షలు, ఎక్స్‌రే, ఈసీజీ సౌకర్యాలు అందిస్తున్న వైద్యులు - జాతరకు వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఏజెన్సీ వైద్యారోగ్యశాఖ

MULTI SPECIALITY CLINIC
MOBILE MINI HOSPITAL (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 28, 2025, 5:46 PM IST

Mobile Mini Hospital in Adilabad : ఇక్కడి చిత్రంలో ఎడమ వైపు కనిపిస్తున్న కంటెయినర్‌ను హైడ్రాలిక్‌ వ్యవస్థతో తెరిస్తే కుడి పక్కన చిత్రంలో మాదిరిగా మల్టీ స్పెషల్‌ డయాగ్నస్టిక్‌ సంచార వైద్యశాలగా మారుతుంది. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా జాతర నేపథ్యంలో ఆలయం వద్ద సోమవారం (జనవరి 27) నుంచి అందుబాటులో ఉంచారు. నాగోబా జాతరకు వచ్చే భక్తుల కోసం ఏజెన్సీ వైద్యారోగ్యశాఖ ఈ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇది మొదటగా కంటెయినర్‌ మాదిరే ఉంటుంది. తరువాత హైడ్రాలిక్‌ పద్ధతిలో ఒక్కో భాగాన్ని తెరిస్తే మోడ్రన్ ఆసుపత్రిలా మారుతుంది. రోగులకు ఏవైనా పరీక్షలు, ప్రసవాలు, సర్జరీలు చేయటానికి లోపలి వైపు వేర్వేరుగా విశాలమైన గదులతో ఉంటుంది.

ఐటీడీఏకు బహుమతిగా : అన్నిరకాల రక్త, మల, మూత్ర పరీక్షలు, ఎక్స్‌రే, ఈసీజీ సౌకర్యాలు ఈ అత్యాధునిక హస్పిటల్​లో ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో తొలి ప్రయోగంగా దీనిని రూపొందించారు. దాదాపు రూ.2 కోట్ల విలువ చేసే ఈ సంచార వైద్యశాలను హైదరాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌ (బీఈఎల్‌) రూపొందించింది. ఏడాది కిందట అప్పటి ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి చొరవతో ఉట్నూరు ఐటీడీఏకి బహుమతిగా ఇచ్చింది. నాగోబా జాతర జరుగుతున్న నేపథ్యంలో వారం రోజులపాటు ఈ కంటెయినర్ హస్పిటల్​ను అందుబాటులో ఉంచుతున్నట్లు ఏజెన్సీ డీఎంహెచ్‌వో డా.మనోహర్‌ తెలిపారు. కంటెయినర్‌ని ఆసుపత్రిలా మార్చే ప్రక్రియను చర్లపల్లిలోని అపెరాన్‌ అనే సంస్థ చూస్తుందని, శిబిరం ముగిసిన తర్వాత మూసివేసి మాములు వాహనంలానే తీసుకెళ్తారని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details