తెలంగాణ

telangana

ETV Bharat / state

మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ - తీర్పును వాయిదా వేసిన కోర్టు - MOHANBABU ANTICIPATORY BAIL

మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్​పై హైకోర్టులో విచారణ పూర్తి - తీర్పు సోమవారానికి వాయిదా - జల్​పల్లిలో జర్నలిస్టుపై దాడి ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు

JALPALLI HOUSE CONFLICT
ACTOR MOHAN BABU CASE (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 6 hours ago

Updated : 5 hours ago

Maohan Babu Anticipatory Bail Petition : సీనియర్ నటుడు మోహన్‌బాబు (భక్తవత్సలం నాయుడు) హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యింది. ఈ పిటిషన్​ విషయంలో తీర్పును న్యాయస్థానం ఈనెల (డిసెంబరు) 23వ తేదీకి వాయిదా వేసింది. మంచు మనోజ్​ వల్ల కుటుంబ వివాదం నేపథ్యంలో జల్‌పల్లిలోని తన నివాసం వద్దకు వెళ్లిన ఓ ఛానల్​ రిపోర్టర్​పై దాడి ఘటనలో ఆయనపై పహాడీ షరీఫ్‌ పోలీసులు హత్యాయత్నం (Attempt to Murder) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోహన్‌బాబును పోలీసులు అరెస్టు చేయకుండా హైకోర్టులో ముందస్తు బెయిల్​ పిటిషన్‌ దాఖలు చేశారు.

మోహన్​బాబు, మంచు మనోజ్​ వివాదం : జల్​పల్లిలోని తన నివాసంలో (డిసెంబరు) జరిగిన ఘటనపై మోహన్ బాబు స్పందించిన తీరు అందరికీ తెలిసిందే. కొన్ని కారణాల వల్ల తాను, తన చిన్న కుమారుడు మంచు మనోజ్ ఘర్షణ పడ్డామని ప్రతి ఫ్యామిలీలోనూ ఇలాంటివి ఉండడం సహజమైనవేనని మీడియాకు ఓ ఆడియో రూపంలో సందేశాన్ని పంపించారు.

మనోజ్​పై సంచలన ఆరోపణలు :మోహన్​బాబు తన చిన్న కుమారుడు మంచు మనోజ్​ భార్య(భూమా మౌనిక) మాటలు విని తాగుడుకు అలవాటుపడ్డాడని సంచలనమైన ఆరోపణలు చేశారు. కొన్ని మీడియా సంస్థలు రేటింగ్ కోసం ఉన్నది, లేనిదీ అంతా ఊహాగానాలతో రాస్తున్నాయని విడుదల చేసిన ఆడియోలో మోహన్ బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్​ పోలీసులను తనకు రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేస్తే సమాధానం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంట్లోకి ఎవరిని రాకుండా అడ్డుకోవాల్సింది పోయి వారందరినీ పోలీసులే వదిలిపెట్టారని తెలిపారు. ఫిర్యాదు చేసినా పోలీసులు మనోజ్​ను తన నివాసంలోకి ప్రవేశించకుండా కట్టడి చేయలేకపోయారన్నారు.

మోహన్​బాబు తన కష్టార్జితమైన నివాసంలోకి కుమారుడు మనోజ్​కు ప్రవేశించే అధికారం లేదని స్పష్టం చేశారు. మనోజ్​ తన కుమార్తెను ఎప్పుడైనా జల్​పల్లి నివాసం నుంచి తీసుకెళ్లవచ్చని తెలిపారు. ఒకవేళ మనోజ్​ రాకపోయినా తాను ఆ పాపను జాగ్రత్తగా పెంచుతానని వెల్లడించారు. మోహన్​బాబు భార్య ఆసుపత్రి నుంచి వచ్చాక మనోజ్​ కుమార్తెను అప్పగిస్తానని తెలిపారు. ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలుకలాని మోహన్​బాబు ఆఖర్లో తన కుమారుడు మనోజ్​కు సూచించారు.

లా అండ్​ ఆర్డర్​కు విఘాతం కలిగించరాదు - మంచు విష్ణుకు సూచించిన రాచకొండ సీపీ

'నా ముందస్తు బెయిల్​ను హైకోర్టు తిరస్కరించలేదు' - మోహన్​బాబు మరో ట్వీట్

Last Updated : 5 hours ago

ABOUT THE AUTHOR

...view details