ETV Bharat / state

ఫార్ములా ఈ-కార్ల రేసింగ్​లో అసలేం జరిగింది? - ఏసీబీ విచారణలో ఏ అంశాలపై దర్యాప్తు జరగనుంది? - FORMULA E RASE CASE UPDATE

ఫార్ములా-ఈ కార్ల రేసు వ్యవహారంలో ఉల్లంఘనలపై మొదలైన ఏసీబీ విచారణ - దర్యాప్తులో ఏయే అంశాలపై ఏసీబీ దృష్టి సారించనుంది? - విచారణ కోసం గవర్నర్ అనుమతి ఎందుకు తీసుకున్నారు?

ACB REGISTERED THE CASE E-RACE
FORMULA E-RACE IN TANKBUND (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

ACB Registered Case Against KTR : ఫార్ములా-ఈ కార్ల రేసు వ్యవహారంలో ఉల్లంఘనలు జరిగాయని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన వ్యక్తులపై చర్యలకు ఉపక్రమించి విచారణకు ఆదేశించింది. పోటీ నిర్వహణ సంస్థకు ఏకపక్షంగా చెల్లింపులు జరగడం, రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకండా విదేశీ సంస్థకు నిధుల బదిలీ జరగడంపై దృష్టి సారించింది. ఈ వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ ద్వారా విచారణ చేయించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఏసీబీకి లేఖ రాసింది.

హైదరాబాద్​లోని హుస్సేన్ సాగర్ చుట్టూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2.8 కిలోమీటర్ల ట్రాక్​లో 2023 ఫిబ్రవరి 10,11 తేదీల్లో నిర్వహించిన మొదటి ఫార్ములా-ఈ కార్ల పోటీకి దేశ వ్యాప్తంగా అభిమానులు హాజరయ్యారు. అది విజయవంతం కావడంతో 2024 ఫిబ్రవరి 10న మరో మారు నిర్వహించాలని భావించారు. అయితే 2023 డిసెంబర్​లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఒప్పందంలో పేర్కొన్న అంశాలను పాటించకపోవడంతో తాము హైదరాబాద్ రేస్ నుంచి తప్పుకొంటున్నట్లు అదే నెలలో ఫార్ములా-ఈ ఆపరేషన్స్ ప్రకటించింది. దాంతో సెషన్ రద్దు అయ్యింది.

ప్రక్రియ త్వరగా జరగాలనే : ఈ పోటీల నిర్వహణలో ఉల్లంఘనలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. బోర్డు, ఆర్థికశాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండా రూ. 55 కోట్లను విదేశీ సంస్థకు హెచ్ఎండీఏ చెల్లింపులు చేయడం ప్రధాన అభియోగం. దీనిపై వివరణ ఇవ్వాలని గతంలో పురపాలకశాఖ బాధ్యతలు నిర్వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్​కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మెమో సైతం జారీ చేశారు. సీఎస్ మెమోకు సమాధానం ఇచ్చిన అర్వింద్ కుమార్ ప్రక్రియ త్వరగా జరగాలన్న ఉద్దేశంతోనే చెల్లింపులు చేశామని పురపాలక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే జరిగిందని వివరణ ఇచ్చారు.

ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ), ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, పురపాలకశాఖ మధ్య 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం కింద లాంగ్-ఫాం ఎల్ఎఫ్ఎ జరిగిందని ఆయన తెలిపారు. 9,10,11,12 సీజన్ల కార్ రేసులు నిర్వహించేలా ఈ ఒప్పందం కుదరిందని తెలిపారు. తొమ్మిదో సీజన్ కార్ రేస్​ను 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో హైదరాబాద్​లోని నెక్లెస్ రోడ్​లో నిర్వహించారని అప్పటి పురపాలకశాఖ మంత్రి ఆమోదంతోనే ఒప్పందం కుదిరిందని, శాఖాధిపతిగా తాను ఎంఓయూ చేశానని అర్వింద్ కుమార్ పేర్కొన్నారు.

అప్పటి మంత్రి కేటీఆర్​ సూచించారనే : ప్రతి సీజన్​లో పెట్టుబడి పెడతానన్న ప్రమోటర్ తొలి సీజన్​లో తనకు నష్టం వచ్చిందంటూ లేఖలు రాసినట్లు పురపాలకశాఖ పేర్కొంది. పదో సీజన్​కు వచ్చే సరికి ప్రమోటర్​గా ఉండేందుకు ఏస్ నెక్ట్స్​జెన్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకు రాలేదు. ఒప్పందాన్ని రద్దు చేసుకోలేదు. హైదరాబాద్​లో రేసు నిర్వహించేందుకు ఎఫ్ఈఓ ఆసక్తి చూపిందని, తగిన సమయం లేదనందువల్ల ప్రత్యామ్నాయ ప్రమోటర్​ను ఖరారు చేయడంలో జాప్యం జరుగుతున్నందున పదో సీజన్ నిర్వహణపై ముందుకెళ్లాలని పురపాలక శాఖ మంత్రి సూచించారని వివరించారు. నిధుల చెల్లింపునకు సంబంధించి సెప్టెంబర్ 25న ఎఫ్ఈఓ నుంచి వచ్చిన మెయిల్ ఆధారంగా 2023 సెప్టెంబర్ 27న మంత్రికి ఫైల్​ను సర్క్యులేట్ చేసి హెచ్ఎండీఏను ప్రమోటర్​గా, హోస్ట్ సిటీగా చేర్చామన్న ఆయన తర్వాత ప్రమోటర్​తో ఎఫ్ఈఓ ఒప్పందాన్ని రద్దు చేసుకొందని పేర్కొన్నారు.

దీంతో త్రైపాక్షిక ఒప్పందం కాస్తా ఎఫ్ఈఓ, హెచ్ఎండీఏల మధ్య ద్వైపాక్షిక ఒప్పందంగా మారినట్లైంది. ఎఫ్ఈఓకు అక్టోబర్ ఐదో తేదీన 23 కోట్లు, 11న మరో రూ. 23 కోట్లు కలిపి మొత్తం రూ. 46 కోట్లను హెచ్ఎండీఏ నుంచి చెల్లించారు. పన్నుల కింద మరో రూ. 9 కోట్లు కూడా హెచ్ఎండీఏ చెల్లించింది. రేసులో హెచ్ఎండీఏ ప్రమోటర్​గా చేరినా అందుకు బోర్డు ఆమోదం తీసుకోలేదని ప్రభుత్వం గుర్తించింది. ఎఫ్ఈఓ, హెచ్ఎండీఏ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం 2023 అక్టోబర్ 30న కుదిరింది. దాని కంటే ముందే హెచ్ఎండీఏ డబ్బులు చెల్లించింది.

ఆర్​బీఐ అనుమతి లేదు : అక్టోబర్ 11న రెండో దఫాగా రూ. 23 కోట్లు చెల్లించడానికి ముందే ఎన్నికల షెడ్యూల్ వెలువడిందని, అయిప్పటికీ ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోలేదని ప్రభుత్వం గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు రూ. 43 కోట్లను పౌండ్లుగా మార్చి ఎఫ్ఈఓకు చెల్లించిందని, ఇలా చెల్లించాలంటే రిజర్వ్ బ్యాంకు అనుమతి అవసరమని, అనుమతి తీసుకోపోవడం ఉల్లంఘనల కిందకు వస్తుందని ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదులో పురపాలకశాఖ పేర్కొంది. ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో ఒప్పందం కుదరడానికి ముందే నిధులు చెల్లించడం, నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ రూపంలో ఇవ్వడంపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఈ అంశంపై విచారణ చేపట్టాలని అవినీతి నిరోధక శాఖకు అక్టోబర్ నెల చివరి వారంలో పురపాలకశాఖ లేఖ రాసింది.

ఎలాంటి ఉల్లంఘనలు కాలేదు : అటు హైదరాబాద్ నగరం, తెలంగాణ ప్రతిష్ట పెంచేందుకు ఫార్ములా-ఈ రేసును తీసుకొచ్చేందుకు ఎంతగానో కృషి చేశామన్న అప్పటి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తదుపరి సెషన్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు ఉండరాదన్న ఉద్దేశంతోనే తాము నిధుల చెల్లింపుపై నిర్ణయం తీసుకున్నామని మీడియాకు తెలిపారు. పురపాలక శాఖ మంత్రిగా, హెచ్ఎండీఏ వైస్ ఛైర్మన్​గా తాను అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్​గా ఉన్న అర్వింద్ కుమార్​కు ఆదేశాలు ఇచ్చినట్లు వివరించారు. హెచ్ఎండీఏకు ఛైర్మన్​గా ఉన్న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి కూడా ఉందని తెలిపారు. ఇందులో ఎలాంటి తప్పు లేదని త్రైపాక్షిక ఒప్పందంలోని సంస్థ తప్పుకోవడంతో రేసు నిర్వహణ కోసం నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. ఎలాంటి ఉల్లంఘనలు చోటు చేసుకోలేదని, ఎక్కడా దుర్వినియోగం జరగలేదని ఆయన వివరించారు.

విచారణ కోరుతూ ఏసీబీకి లేఖ వచ్చినప్పటికీ బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలంటే వారి స్థాయిని బట్టి ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంది. దీంతో అప్పటి పురపాలకశాఖ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్​పై ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతి కోసం గవర్నర్​కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అప్పటి పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్​పై కేసు నమోదుకు ప్రభుత్వం ఇప్పటికే అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఏసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. అప్పటి చీఫ్ ఇంజనీర్​పై కేసు నమోదు చేసి, విచారణ జరిపేందుకు కూడా పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అంగీకారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ లేఖపై మొదట న్యాయ సలహా కోరిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తాజాగా కేటీఆర్​పై విచారణకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సీఎస్​ విచారణ జరపాలని ఏసీబీకి లేఖ రాయడంతో అధికారులు ఇవాళ కేసు నమోదు చేశారు.

ఓఆర్​ఆర్​ టోల్ టెండర్లపై విచారణ కోసం సిట్‌ - అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటన

ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌ కేసు - ఏ1గా కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.