Gangrape In Siddipet District :అభం శుభం తెలియని చిన్నారులపై ఏదో ఓ చోట అత్యాచార ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న మైనర్ బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్రేప్నకు పాల్పడ్డారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన గురించి బాలిక సోమవారం రాత్రి తన తల్లికి వివరించింది. ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీను తెలిపారు. అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు యువకులు బాలిక ఉంటున్న కాలనీకి చెందిన వారుగా గుర్తించినట్లు చెప్పారు. బాలికను వైద్య పరీక్షలకు పంపినట్లు సీఐ వివరించారు.
సిద్దిపేట జిల్లాలో అమానుష ఘటన - మైనర్ బాలికపై యువకుల సామూహిక అత్యాచారం - GANGRAPE IN SIDDIPET DISTRICT
సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన - మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు యువకులు - కేసు నమోదు చేసిన పోలీసులు
Gangrape In Siddipet District (ETV Bharat)
Published : Oct 29, 2024, 3:24 PM IST