తెలంగాణ

telangana

ETV Bharat / state

నేవీ రాడార్​కు అనుమతులిచ్చింది గత ప్రభుత్వమే - దీన్ని రాజకీయం చేయొద్దు : కొండా సురేఖ

Minister Konda Surekha Counter To KTR on Navy Radar : రాష్ట్రంలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ కేంద్రం ఏర్పాటుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అనుమతులిచ్చిందని, ఇప్పుడు పర్యావరణ హాని అని రాజకీయం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు.

Minister Konda Surekha Fires on KTR
Minister Konda Surekha Counter To KTR on Navy Radar

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2024, 7:51 PM IST

Updated : Jan 30, 2024, 7:59 PM IST

Minister Konda Surekha Counter To KTR on Navy Radar : వికారాబాద్​లో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణానికి ఎలాంటి నష్టం ఉండదని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ తెలిపారు. రేడియేషన్​లో క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయనే ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని మంత్రి అన్నారు. రాడార్ ప్రాజెక్టుతో ప్రకృతికి నష్టం జరగదని, గ్రామాలు ఖాళీ చేయాల్సిన అవసరం అసలే లేదని చెప్పారు.

'దామగుండంలో నేవీ రాడార్ వద్దు'

నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన అనుమతులన్నీ బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వమే ఇచ్చిందని, ఇప్పుడు తప్పుడు ప్రచారంతో రాజకీయం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. అనుమతులిచ్చినప్పుడు ఈ అంశాలన్ని వారికి తెలియదా అని ప్రశ్నించారు. ఈ కేంద్రం ఏర్పాటు కేసం 2010 నుంచే సంప్రదింపులు జరిగాయని గుర్తు చేశారు. 2017 డిసెంబర్ 19వ తేదీనా అటవీ భూములు నేవీకి బదిలీ చేస్తూ జీవో నెంబర్ 44జారీ అయిందని కొండా సురేఖ తెలిపారు.

రక్షణశాఖ భూముల బదిలీకి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్ - రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులకు ముందడుగు

Minister Konda Surekha Fires on KTR : బైసన్ పోలో గ్రౌండ్​ను తెలంగాణకు ఇస్తేనే రాడార్కేంద్రం ఏర్పాటుకు అనుమతులు ఇస్తామని గతంలో కేసీఆర్ (EX CM KCR) పేచీ పెట్టారన్నారు. బైసన్ పోలో గ్రౌండ్​లో కొత్త సెక్రటేరియట్ కడితేనే తన కుమారుడు కేటీఆర్​కు (KTR) ముఖ్యమంత్రి యోగం ఉంటుందన్న నమ్మకాలతో చివరి దశలో కేసీఆర్ పెట్టిన చిక్కులతో బ్రేకులు పడ్డాయన్నారు. రాడార్ కేంద్రం ఏర్పాటు అయితే దేశ భద్రతలో తెలంగాణకు పాత్ర ఉందని గర్వించాలన్న ఆమె, దేశ రక్షణ విషయంలో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తామంటే వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని మంత్రి వ్యాఖ్యానించారు.

భద్రత అంశాలు ముఖ్యమే... పర్యావరణాన్ని పరిరక్షించాల్సిందే: హైకోర్టు

రాడార్ కేంద్రం (Navy Radar Center) ఏర్పాటుకు దేశ భద్రతకు సంబంధించిన అంశమని తెలిపారు. దీనిలో కాంగ్రెస్ పార్టీ లేదా మరెవరీ ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాదని మంత్రి స్పష్టం చేశారు. పర్సెంటేజీల కోసం ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా లీజులిచ్చి రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు నీతి సూత్రాలు చెబుతోందని సురేఖ విమర్శించారు.

Minister Konda Surekha Counter To KTR on Navy Radar : వికారాబాద్​లో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణానికి ఎలాంటి నష్టం ఉండదని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ తెలిపారు. రేడియేషన్​తో క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయనే ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని మంత్రి అన్నారు.

Minister Konda Surekha Counter To KTR on Navy Radar

'ఇక్కడ రాడార్​ వద్దు... ప్రజల ప్రాణాలే ముఖ్యం'

Last Updated : Jan 30, 2024, 7:59 PM IST

ABOUT THE AUTHOR

...view details