Mid Manair project Expatriates story : రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడలో 27.55 టీఎంసీల సామర్థ్యంతో మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మించారు. నిర్మాణ సమయంలో బోయినపల్లి, వేములవాడ,తంగళ్లపల్లి మండలాలకు చెందిన 12 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రాజెక్టులోకి 2019లో పూర్తిస్థాయిలో 25 టీఎంసీల నీరు చేరడంతో నిర్వాసితులు(Expatriates) పునరావాస కాలనీలకు(rehabilitation center) తరలివెళ్లారు.
Expatriates On Government :2022లో ప్రాజెక్టులో నీటిమట్టం 8 టీఎంసీలకు చేరగా పాత ఊళ్ల ఆనవాళ్లు కనిపించాయి.తిరిగి రెండేళ్ల అనంతరం కొద్ది రోజులుగా మిడ్‌మానేరులో 6.69 టీఎంసీల మేర నీరు మాత్రమే ఉండడంతో ముంపునకు గురైన ఇళ్ల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. వాటిని చూసేందుకు తరలివస్తున్న నిర్వాసితులు ఆనాడు తాము గ్రామాలు(villages) ఖాళీ చేయాలని ప్రభుత్వాలు ఎన్నో హామీలు ఇచ్చినా వాటిని నిలబెట్టుకోలేదని వాపోతున్నారు.
Decreasing Water Levals in Water Bodies :వర్షాభావ పరిస్థితులు వేసవి తీవ్రత కారణంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జలాశయాల్లో నీరు అడుగంటిపోతున్నాయి. రాష్ట్రంలో జలాశయాలకు ఎగువ నుంచి ప్రవాహాలు పెద్దగా లేవు. గోదావరి పరీవాహకంలో శ్రీరాంసాగర్, దిగువ మానేరులకు స్వల్పంగా వస్తుండగా మిగతా ఏ ప్రాజెక్టుకూ పైనుంచి చుక్కనీరూ రావడం లేదు. పైపెచ్చు ఉన్న జలాలు వినియోగం అవుతుండటం, ఎండల కారణంగా నీరు ఆవిరవుతుండటంతో నీటిమట్టాలు వేగంగా అడుగంటుతున్నాయి((Decreasing Water Levals)
నీటి ఎద్దడికి చర్యలు చేపట్టిన అధికారులు :ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాలతోఅధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఇన్‌టేక్ వెల్స్ వరకు కాలువలను లోతుగా తవ్వగా మరింత అడుగంటే పక్షంలో నది నుంచే నేరుగా నీటిని ఎత్తిపోసేందుకు కసరత్తు ఆరంభించారు. ప్రధానంగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో సమస్య తలెత్తకుండా పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని తోడేందుకు వీలుగా అత్యవసర ఏర్పాట్లు చేస్తున్నారు.