Margadarshi 119 Branch Open :విశ్వసనీయతకు మారుపేరు.. నమ్మకానికి అమ్మ వంటి మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ తన 119వ బ్రాంచ్‌ను కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రారంభించింది. బెంగళూరులోని కెంగేరిలో మార్గదర్శి చిట్‌ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ బ్రాంచ్‌ను ప్రారంభించారు. ముందుగా రిబ్బన్ కట్ చేసి.. పూజలు చేశారు. అనంతరం ఉద్యోగులతో కాసేపు మాట్లాడారు. బ్రాంచ్ మొదటి కస్టమర్ నుంచి చిట్ కట్టించుకున్నారు. బ్రాంచ్‌లో ఉద్యోగులతో మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ సరదాగా గడిపారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త శాఖలు ప్రారంభించనున్న సందర్భంగా మార్గదర్శి చిట్‌ఫండ్ ఎండీ శైలజా కిరణ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు.
2000లో కర్ణాటకలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను ప్రారంభించాం. ఇప్పుడు 24 ఏళ్లు పూర్తి చేసుకుంది. బెంగళూరుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెంగేరిలో ఇవాళ 25వ బ్రాంచ్‌ను ప్రారంభించాం. వచ్చే నెలలో కర్ణాటకలోనే మరో రెండు బ్రాంచ్‌లను తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్నాం. కర్ణాటకలో మార్గదర్శి సంస్థ శరవేగంగా విస్తరిస్తోంది. ఇక్కడి ప్రజలకు తగ్గట్టుగా సేవలందించే సామర్థ్యం మాకు ఉంది. వివిధ వర్గాల ప్రజలు మార్గదర్శిలో చందాదారులుగా ఉన్నారు. వారికి అత్యుత్తమ సేవలందించేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం. మా చందాదారులు తమ కలలను నేరవేర్చుకునేందుకు వారికి సహాయపడటానికి సురక్షితమైన, పారదర్శకమైన, క్రమశిక్షణతో కూడిన పొదుపు ఎంపికలను అందించడానికి మార్గదర్శి చిట్‌ఫండ్ ఎప్పుడు ముందుంటుంది - శైలజా కిరణ్, మార్గదర్శి చిట్‌ఫండ్ ఎండీ
మార్గదర్శిలో పెట్టుబడి 100 శాతం సురక్షితం :సాయంత్రం తమిళనాడులోని హోసూరులో 120వ బ్రాంచ్ ప్రారంభం కానుంది. అత్యంత విశ్వసనీయమైన, కస్టమర్ ఫ్రెండ్లీ మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. నమ్మకమే మారుపేరుగా అందరి మదిలో మార్గదర్శి సుస్థిర స్థానం సంపాదించుకుంది.
చందాదారులు ఎంతో క్రమశిక్షణతో సక్రమంగా నెలనెలా చెల్లిస్తున్నారని మార్గదర్శి చిట్‌ఫండ్ ఎండీ శైలజా కిరణ తెలిపారు. అదేవిధంగా మావైపు నుంచి చందాదారులకు అవసరమైనప్పుడు ఎలాంటి ఆలస్యం లేకుండా వారికి డబ్బులందిస్తున్నామన్నారు. పరస్పర సహకారంతో చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయని ఎండీ వివరించారు. మార్గదర్శిలో పెట్టుబడి అంటేనే 100 శాతం సురక్షితమైనదని అన్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా చిట్ ఫండ్ రూల్స్ ఆధారంగా చందాదారుల ఖాతాల్లోకి సమయానికి నగదు వెళ్తోందని తెలిపారు.