తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదు' - కేంద్ర జల్‌శక్తి శాఖకు చేరిన అసెంబ్లీ తీర్మానం - Krishna River Water Disputes

Krishna Water Disputes Issue : కృష్ణా జలాలపై శాసనసభ తీర్మానాన్ని నదీ యాజమాన్య బోర్డు కేంద్ర జల వనరుల శాఖకు పంపింది. ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని ఇటీవల అసెంబ్లీ తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నీటి పారుదల శాఖ కార్యదర్శి రాసిన లేఖను కృష్ణా బోర్డు కేంద్రానికి నివేదించింది. ఈ మేరకు కేఆర్ఎంబీ కేంద్ర జల వనరుల శాఖ సంయుక్త కార్యదర్శికి లేఖ రాశారు.

Telangana assembly resolution passed to central water power department
Krishna Water Disputes Issue

By ETV Bharat Telangana Team

Published : Mar 1, 2024, 12:25 PM IST

Krishna Water Disputes Issue : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి నీటి ప్రాజెక్టులను కేఆర్​ఎంబీకి అప్పగించేది లేదని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్మానం తాజాగా కేంద్ర జల్​శక్తి శాఖకు చేరింది. కృష్ణా జలాలపై చేసిన తీర్మానం నేపథ్యంలో నీటి పారుదల శాఖ కార్యదర్శి కేఆర్‌ఎంబీకి లేఖ రాయగా, ఈ మేరకు కేఆర్​ఎంబీ కేంద్ర జల వనరుల శాఖ సంయుక్త కార్యదర్శికి లేఖ రాసింది.

ఇదీ అసెంబ్లీ తీర్మానం : కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్​ఎంబీ సంబంధిత అంశాలపై ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తరఫున నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. పవర్​ పాయింట్​ ద్వారా ఆ విషయాలను శాసనసభ్యుల వివరించారు. షరతులు అంగీకరించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించే ప్రసక్తే లేదని మంత్రి తేల్చి చెప్పారు.

కృష్ణా ప్రాజెక్టులను కేఆర్​ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదు : మంత్రి ఉత్తమ్​

ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం సాగర్​పై పోలీసులను మోహరించిన విషయాన్ని ఉత్తమ్​కుమార్​ రెడ్డి గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నదీ జలాల విషయంలో తెలంగాణకు న్యాయం జరుగుతుందని అంతా ఆశించామని, అయితే రోజుకు 3 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం అక్రమంగా తరలించుకు వెళుతుందని ఆరోపించారు. పదేళ్ల పాటు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 219 టీఎంసీలకు గత బీఆర్​ఎస్​ సర్కార్ ఒప్పుకుందని వివరించారు.

బీఆర్​ఎస్​ పాలకులది అవగాహన లోపమో, అసమర్థతో అర్థం కావడం లేదని మంత్రి ధ్వజమెత్తారు. కృష్ణా జలాల్లో 70 శాతం హక్కు పొందేందుకు తెలంగాణకు పూర్తి అర్హత ఉందని చెప్పారు. కానీ 512:219 టీఎంసీల కేటాయింపును ఏపీ శాశ్వతం చేస్తోందన్నారు. పదేళ్ల బీఆర్​ఎస్​ పాలనలో జరిగిన అవినీతి, స్వతంత్ర భారతంలో ఎప్పుడూ జరగలేదని విమర్శించారు. ఈ క్రమంలోనే కేసీఆర్​ చాలా గొప్పవారని ఏపీ అసెంబ్లీలో జగన్​ పొగిడారని, తెలంగాణ జలాలను సైతం ఏపీకి ఇస్తున్నారని జగన్​ చెప్పారని ఉత్తమ్​ కుమార్​ రెడ్డి స్పష్టం చేశారు.

'జల విద్యుత్ కేంద్రాల ఔట్ లెట్లను స్వాధీనం చేయాలంటే ప్రభుత్వం నుంచి ఆమోదం తీసుకోవాల్సిందే'

ABOUT THE AUTHOR

...view details