Kistapuram Village Families Get Government Jobs : పదేళ్ల క్రితం కిష్టాపురంగా చలామణిలో ఉన్న గ్రామం ప్రస్తుతం పెద్దకిష్టాపురం, చిన్నకిష్టాపురం పంచయతీలుగా ఎదిగాయి. ప్రస్తుతం పెద్దకిష్టాపురంలో 653, చిన్నకిష్టాపురం పంచాయతీలో 456 కుటుంబాలు అనగా మొత్తం 1,109 కుటుంబాలు విస్తరించాయి. ఇక్కడ పిల్లలు సెలవుల్లో తల్లిదండ్రులతో పాటు పనిచేస్తూ కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలిచేవారు. అలా పనులు చేస్తున్న వారికి పేదరికాన్ని జయించాలనే కసితో అక్కడి యువతు కష్టపని ప్రభుత్వ కొలువులు సాధించి పలువూరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
గ్రంథాలయాన్నే నివాసంగా మార్చుకున్న యువకుడు - వరుస కట్టిన 5 ప్రభుత్వ ఉద్యోగాలు
ప్రస్తుతం ఆయా గ్రామాల నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా 81మంది, పోలీస్‌శాఖలో 28 ఉద్యోగాలు సాధించారు. బ్యాంకుల్లో ఎనమిది మంది పనిచేస్తున్నారు. డాక్టర్లుగా 6మంది వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులుగా 6మంది కొలువులు సాధించారు. అటవీ శాఖలో ఇద్దరు పని చేస్తున్నారు. తంతి తపాలా ఉద్యోగులుగా ఇద్దరు, ప్రొఫెసరుగా ఒక్కరు, అసిస్టెట్ ప్రొఫెసరుగా ఒకరు, జూనియర్ అసిస్టెంట్లుగా ఇద్దరు, కేజీబీవీలో ఉపాధ్యాయులుగా 5మంది, ఏఈవోగా ఒక్కరు, బీహెచ్‌ఈఎల్‌లో ఒక్కరు, ఏఈగా ఒకరు, ఐపీఎస్‌లో ఒక్కరు, 13 మంది ఇతర ఉద్యోగాల్లో పని చేస్తున్నారు. 25 మందికి పైగా ఉద్యోగ విరమణ చేసినవారున్నారు. పెద్దకిష్టాపురంలో మొత్తం 70 మంది, అంజనాపురంలో 48మంది, చిన్నకిష్టాపురంలో 43మంది, ప్రభుత్వ ఉద్యోగాల్లో వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నవారు కూడా ఉన్నారు.