తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళకు కుడివైపున గుండె - అలాంటి భార్య నాకొద్దు అంటూ కోర్టుకెక్కిన భర్త - KHAMMAM WOMAN WITH HEART RIGHT SIDE - KHAMMAM WOMAN WITH HEART RIGHT SIDE

Woman With Heart Right Side is Harassed by In Laws : ఆమెకు గుండె కుడి వైపు ఉంది. దానితో ఎటువంటి అనారోగ్య సమస్యలు రాలేదు. చిన్నప్పటి నుంచి అందరిలాగానే ఆరోగ్యంగా పెరిగి బాగా చదువుకుంది. ఎంటెక్‌ పూర్తి చేసి ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేసింది. కానీ పెళ్లైన తర్వాత అది పెద్ద సమస్యగా మారింది. అత్తింటి వేధింపులతో 6 ఏళ్లుగా ఆమె ఓంటరి జీవితం గడపాల్సి వస్తోంది. ఈ ఘటన ఖమ్మంలో జరిగింది.

Right Side Heart Woman Problems
Harassment case of right side heart woman (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 16, 2024, 12:35 PM IST

Updated : Jun 16, 2024, 3:41 PM IST

మహిళకు కుడివైపున గుండె అలాంటి భార్య నాకొద్దు అంటూ కోర్టుకెక్కిన భర్త చితకబాదిన అత్తామామలు (ETV Bharat)

Harassment case of Right Side Heart Woman in Khammam : ఖమ్మం జయనగర్‌ కాలనీకి చెందిన అంబునపురి గంగా భవానికి 2018లో బోనకల్లు మండలానికి చెందిన భాస్కరాచారితో వివాహం అయింది. 16 రోజుల పండుగకు అమ్మాయి ఇంటికి వచ్చారు. వీరి బంధువుల్లో ఎవరో అమ్మాయికి గుండె కుడి వైపు ఉందని చెప్పారు. దీంతో అమ్మాయి అత్తమామ వివాదం రేపారు. మామ హెడ్‌ కానిస్టేబుల్‌ కావడంతో తన పలుకుబడిని ఉపయోగించి అమ్మాయిపై భౌతిక దాడులకు దిగేవాడు. పెళ్లి అయిన 20 రోజుల నుంచి అమ్మాయి పుట్టింటి వద్దే ఉంటోంది. విషయం కోర్టు వరకు వెళ్లింది. కోర్టు అత్తమామలు పెట్టిన అభ్యంతరంపై వైద్యులతో పరీక్షలు చేయించారు.

Right Side Heart WomanProblems : మహిళకు ఎలాంటి ఇబ్బంది లేదని, పూర్తి ఆరోగ్యంగా ఉందని, భర్తతో కాపురం చేయవచ్చని వైద్యులు తేల్చారు. అనంతరం కోర్టు అమ్మాయిని అత్తంటికి వెళ్లమని తీర్పునిచ్చింది. ఆమెను కాపురానికి తీసుకు వెళ్లలేదు. కోర్టు ఆదేశాల మేరకు అత్తవారింటికి వెళ్తే తీవ్రంగా కొట్టడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. అత్తవారింట్లో ఆనందంగా ఉండాల్సిన కుమార్తె ఇలా ఆరేళ్లుగా పుట్టింట్లో ఉండటంతో తల్లి దండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిడ్డకు మంచి సంబంధం వచ్చిందని రూ.లక్షల కట్నంగా ఇచ్చి పెళ్లి చేస్తే కావాలనే ఇలా వేధిస్తున్నారని వాపోతున్నారు. కట్నం కోసం అబ్బాయికి ఇష్టం లేకున్నా పెళ్లి చేశారనే చిన్న కారణం చూపి వేదిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

'నీ పెళ్లికి పెట్టిన ఖర్చులు తిరిగిచ్చేయ్' - అన్నా వదినల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

"కోర్టు మా అత్తగారింట్లో ఉండవచ్చు అని తీర్పు ఇవ్వడంతో వెళ్లాను. నేను వెళ్లేసరికే నా భర్త పరారీ అయ్యాడు. ఈ విషయం మా తల్లిదండ్రులు తెలుసుకుని మా అత్తగారింట్లో ఉండమని చెప్పారు. ఆ సమయంలో మా అత్త తలుపు వేసి చాకుతో నా చేయి కోసింది. మా మామయ్య పోలీసు డ్రెస్​ వేసుకుని ప్లాస్టిక్ వస్తువుతో తలపై కొట్టాడు. మా అత్తయ్య కూడా కొట్టింది. గుండె కుడివైపు ఉన్నా ఎప్పుడు ఆరోగ్య సమస్యలు రాలేదు. వరకట్నం వస్తోందని నా భర్తకు ఇష్టం లేకుండానే పెళ్లి చేశారు. కోర్టుకు వెళ్లినా నాకు న్యాయం జరగలేదు." - గంగాభవాని, బాధితురాలు

Case of in-Laws Molesting a Woman in Khammam: 6 ఏళ్ల నుంచి అబ్బాయిని ఒక్కసారి కూడా కోర్టుకు తీసుకురాకుండా మామ వెంకటేశ్వర్లు తన పోలీసు ఉద్యోగం పలుకుబడి ఉపయోగిస్తున్నాడని చెబుతున్నారు. తన బిడ్డ పరిస్థితిని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ బిడ్డకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అసాధారణంగా 20వేల మందిలో ఒకరికి గుండె కుడివైపు ఉంటుందని దానితో వారి ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపదని అందరిలాగానే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు. అయినా కొంత మంది వ్యక్తులు తమ కాపురాలను నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

మహిళా వైద్యాధికారులపై డీహెచ్​ఎంఓ లైంగిక వేధింపులు! విచారణ చేపట్టిన రాష్ట్ర వైద్యాధికారి - Inquiry On District Medical Officer

Last Updated : Jun 16, 2024, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details