Cm Revanth Reddy On Davos Tour : అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకే దావోస్ వెళ్లామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భారీగా పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకున్నామని, దాదాపు రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులను దావోస్ సదస్సులో ఆకర్షించామని వెల్లడించారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదే అతిపెద్ద విజయం : మా ప్రభుత్వం సాధించిన విజయాల్లో దావోస్ ఒప్పందాలు అతి పెద్దదని రేవంత్ రెడ్డి పెర్కోన్నారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు, వ్యాపారాలపై కొందరు దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. ప్రభుత్వంపై కొందరు చేసిన దుష్ప్రచారం పటాపంచలు అయ్యిందని, ప్రభుత్వంపై, రాష్ట్రంపై నమ్మకం ఉంచుతూ భారీ పెట్టుబడులకు చాలామంది ముందుకు వచ్చారని తెలిపారు. ఈ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచుతూ అంతర్జాతీయ సంస్థలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయని, హైదరాబాద్ నగరాభివృద్ధి అందరిది అని భావిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్శిటీ కోసం సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు. యువతలో సాంకేతిక నైపుణ్యాలు పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
విఫలం అవుతామేమోనని ఆశపడ్డారు : గత ప్రభుత్వంలోని నేతలు ఇక్కడ సొమ్ము కొల్లగొట్టి విదేశాలకు తరలించారని, ఇక్కడ కొల్లగొట్టిన సొమ్మునే విదేశీ పెట్టుబడులుగా చూపారని సీఎం ఆరోపించారు. మేం భారీ పెట్టుడబడులు తేవడం చూసి కొందరికి కడుపుమంటగా ఉందని, మేం వెళ్లినప్పుడు ఇంతస్థాయిలో పెట్టుబడులు రాలేదని అక్కసుతో ఉన్నారని విమర్శించారు. మేం ఎక్కడైనా విఫలం అవుతామేమోనని ఆశపడ్డారని, ప్రతిపక్షంలోని ఒక నేత అటెన్షన్ డిజార్డర్‌తో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. చాలా సంస్థలు తెలంగాణ పెవిలియన్‌కు వచ్చి ఒప్పందాలు చేసుకున్నాయని, ఈ ప్రభుత్వం తెచ్చిన ఎనర్జీ పాలసీతోనే పెట్టుబడులు పెరిగాయని అన్నారు. అనుమతుల్లో సరళీకరణ వల్ల సంస్థలు పెట్టుబడులకు ముందుకు వచ్చాయని, చైనాకు ప్రత్యామ్నాయమైన దేశాన్ని ప్రపంచ దేశాలు వెతుకుతున్నాయని పెర్కోన్నారు. అనుకూల వాతావరణం ఉన్న నగరాల వైపే అంతర్జాతీయ సంస్థలు చూస్తాయని వివరించారు.
"అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు దావోస్ వెళ్లాం. ప్రపంచ ఆర్థిక సదస్సులో భారీగా పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకున్నాం. దాదాపు రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులను దావోస్ సదస్సులో ఆకర్షించాం. గత ప్రభుత్వ నేతలు ఇక్కడ సొమ్ము కొల్లగొట్టి విదేశాలకు తరలించారు. ఇక్కడ కొల్లగొట్టిన సొమ్మునే విదేశీ పెట్టుబడులుగా చూపారు." - రేవంత్‌రెడ్డి, సీఎం
రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ - రూ.15వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న మేఘా ఇంజినీరింగ్
పేదల కళ్లల్లో వెలుగులు చూడాలనే : రాష్ట్ర ప్రజలకు సీఎం వీడియో సందేశం
సెమీ కండక్టర్ పరిశ్రమలో కీలక పెట్టుబడులు! - తెలంగాణ రాష్ట్రం మరో ముందడుగు