JEE Mains Exams Dates Announced : ఐఐటీలు, ఎన్‌ఐటీలు, త్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ పరీక్షా షెడ్యూల్ విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను జేఈఈ పరీక్షలను రెండు దఫాల్లో నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ - ఎన్‌టీఏ తెలిపింది. తొలిదఫా పరీక్షలను 2025 జనవరిలో, రెండో దఫా ఏప్రిల్‌లో నిర్వహిస్తామని స్పష్టం చేసింది. జనవరిలో జరగనున్న పరీక్షల కోసం నేటి నుంచి నవంబర్ 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు పేర్కొంది.
పరీక్షలను నిర్వహించనున్న కేంద్రాల వివరాలను జనవరి మొదటి వారం లోపు ప్రకటిస్తామని ఎన్‌టీఏ తెలిపింది. జనవరి 22 నుంచి 31 తేదీల్లో జేఈఈ తొలిదఫా పరీక్షలు నిర్వహించి, ఫిబ్రవరి 12 లోపు ఫలితాలు విడదల చేస్తామని పేర్కొంది. మొత్తం 13 భాషల్లో పరీక్ష నిర్వహించనున్న ఎన్‌టీఏ సిలబస్ని సైతం ఖరారు చేసింది. మరింత సమాచారం కోసం అభ్యర్థులు ఎన్‌టీఏ వెబ్సైట్ని సందర్శించాలని పేర్కొంది.