తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులకు గుడ్ న్యూస్ - రుణ'మాఫీ' కావాలంటే 'సెల్ఫీ' దిగాల్సిందే - LOAN WAIVER ISSUES IN TELANGANA - LOAN WAIVER ISSUES IN TELANGANA

Identification Process of Farmer Families : రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతుల కుటుంబాల నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతోంది. రేషన్ కార్డులు లేని రైతు కుటుంబ నిర్ధారణ ప్రక్రియను మండల వ్యవసాయశాఖ అధికారులు చేపట్టారు.

Identification Process of Farmer Families for Crop Loan Waiver
Identification Process of Farmer Families for Crop Loan Waiver (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2024, 3:21 PM IST

Identification Process of Farmer Families for Crop Loan Waiver :అన్ని అర్హతలు ఉండి రేషన్​ కార్డు లేని కారణంగా రుణమాఫీ కాని రైతులు కుటుంబాల నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతోంది. మండల వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లోకి వెళ్లి ఆయా రైతుల కుటుంబాలను కలిసి నిర్ధారణ చేస్తున్నారు. ఇందుకోసం సదరు రైతులు ఏం చేయాలంటే?

మొదట రైతు కుటుంబ సభ్యులంతా కలిసి ఓ సెల్ఫీ ఫొటో దిగాలి. ఆ ఫొటోను అధికారులు వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన యాప్​లో అప్​లోడ్ చేస్తారు. అలాగే తమ కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన స్వీయ ధ్రువీకరణ పత్రం కూడా అధికారులు అన్నదాతల నుంచి తీసుకుంటున్నారు. ఈ స్వీయ చిత్రంలో కుటుంబ సభ్యులంతా తప్పక ఉండాలి. లేని పక్షంలో కనీసం కుటుంబ పెద్ద అయినా ఉండాలి.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల పంట రుణాల మాఫీని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఒక్కో రైతు కుటుంబంలో రూ.2లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తోంది. రూ.లక్ష లోపు పంట రుణమున్న రైతులకు తొలి విడతలో రూ.లక్ష నుంచి రూ1.5 లక్షల లోపు ఉన్న పంట రుణాలను మూడో విడతలో చెల్లించింది.

రుణమాఫీ కాని రైతులకు శుభవార్త - రేపటి నుంచి సర్వే - వివరాల నమోదుకు యాప్​ - RYTHU BHAROSA APP FOR FARMERS

ప్రక్రియ చేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు :కానీ అనేక కారణాల వల్ల రాష్ట్రంలో చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. మాఫీ వర్తించని కారణాల్లో ఒకటి రేషన్ కార్డు లేకపోవడం వంటిది. కుటుంబ నిర్ధారణ జరగని రైతుల జాబితాను వ్యవసాయ శాఖ బ్యాంకర్ల నుంచి సేకరించి మండల వ్యవసాయ అధికారులకు అందించింది. రేషన్ కార్డు లేని కుటుంబాల నిర్ధారణ కోసం ఇప్పుడు గ్రామాల్లో ప్రక్రియ కొనసాగుతోంది.

హైదరాబాద్ వంటి నగరాల్లో ఉంటున్న రైతులు కుటుంబ పెద్దలు తమ స్వగ్రామాలకు వచ్చి సెల్ఫీలు దిగి, స్వీయ ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తున్నారు. పదిహేను రోజుల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. కొన్ని రైతు కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉన్నారు, వారి బంధవులు ఇక్కడ వారి భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇలా విదేశాల్లో ఉన్న రైతులకు సంబంధంచిం వారి వివరాల అధికారులు ప్రస్తుతం పక్కన పెట్టేశారు.

రుణమాఫీ కాలేదా అయితే అర్జీ ఇవ్వండి - ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే? - Farmers on Loan Waiver Issues

రుణమాఫీ అమల్లో 31 టెక్నికల్ సమస్యలు - మరి పరిష్కారం ఏంటంటే? - CROP LOAN WAIVER TECHNICAL ISSUES

ABOUT THE AUTHOR

...view details