Google Maps Takes Car into Stream in Kottayam : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఎక్కువ దూరం ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంటారు. అదీ కూడా సొంత వాహనం బైక్ లేదా కారులో వెళ్లడానికే మక్కువ చూపుతారు. ఇది లేటెస్ట్ ట్రెండ్‌గా కూడా మారిపోయింది. అయితే కొత్త ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరు రూట్ గురించి ఉపయోగించే అస్త్రం గూగుల్ మ్యాప్. ఇప్పుడు ఇదే గూగుల్ మ్యాప్ కొందరి పాలిట శాపంగా మారుతోంది. ఎందుకంటే కొన్నిసార్లు నావిగేషన్ సక్రమంగా చూపిస్తున్నా, కొన్ని ప్రాంతాలకు వెళ్లేటప్పుడు మాత్రం నావిగేషన్ చూపించడం లేదు. దీంతో కొత్తగా వెళ్లే వారు నదులు, కాలువల్లోకి వెళ్లిపోతున్నారు. తాజాగా అలాంటి సంఘటనే కేరళలో జరిగింది.
నావిగేట్ చేయడానికి గూగుల్ మ్యాప్‌లను ఉపయోగించడం వల్ల హైదరాబాద్‌కు చెందిన ఒక పర్యాటక బృందం కేరళలోని నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. ఈ సంఘటన దక్షిణ కేరళ జిల్లాలోని కురుప్పంతర సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో మహిళతో సహా నలుగురు సభ్యులు బృందం ఉంది. ఈ సంఘటన శుక్రవారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే వారంతా క్షేమంగా బయటపడ్డారు.
స్థానికులు, కేరళ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన ఓ నలుగురు సభ్యుల పర్యాటక బృందం కారులో అలప్పుళ ప్రాంతానికి వచ్చి శుక్రవారం అర్ధరాత్రి కురుప్పంతర వైపు వెళుతున్నారు. వారు గూగుల్ మ్యాప్‌ను ఉపయోగిస్తూ నావిగేట్ చేసుకుంటూ వెళ్లారు. ఇంతలో కురుప్పంతర సమీపంలోకి వచ్చే సరికి భారీ వర్షం రావడంతో దారి కనిపించలేదు. గూగుల్ మ్యాప్‌లో ఫాలో అవుతూ వెళ్లేసరికి కారు నీటి ప్రవాహంలో మునిగిపోయింది.