తెలంగాణ

telangana

ETV Bharat / state

మెట్రో రెండోదశ అంచనా వ్యయం రూ.24,269 కోట్లు - క్యాబినెట్‌ ఆమోదించాక కేంద్రానికి అందజేత - METRO RAIL SECOND PHASE DPR

రాష్ట్ర ప్రభుత్వానికి చేరిన మెట్రోరైలు రెండోదశ సమగ్ర ప్రాజెక్టు నివేదిక - 76.2 కిలో మీటర్లకు రూ.24,269 కోట్ల వ్యయం - ఫోర్త్‌సిటీ మినహా మిగిలిన ఐదు కారిడార్లకు వేర్వేరుగా నివేదికలు.

METRO RAIL SECOND PHASE DPR
Hyd Metro Rail Second Phase Estimation Cost (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2024, 7:01 AM IST

Hyd Metro Rail Second Phase Estimation Cost : రాష్ట్ర రాజధానిలో మెట్రో రెండో దశకు త్వరితగతిన అడుగులుపడుతున్నాయి. ఫోర్త్‌ సిటీ మినహా మిగిలిన 5 కారిడార్లకు డీపీఆర్‌లు సిద్ధం అయ్యాయి. ఈ నెల 7న దిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి భేటీ ఖరారు కావడంతో ఆ పర్యటనకు ముందుగానే డీపీఆర్‌లు కావాలని సీఎం కార్యాలయం కోరింది. దీంతో ఏడో తేదీ నాటికి డీపీఆర్‌లను ప్రభుత్వానికి సమర్పించామని హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రోరైలు సంస్థ అధికారులు తెలిపారు. నివేదికలు గతంలోనే సిద్ధమైనా కీలకమైన ట్రాఫిక్‌ అధ్యయన నివేదిక ‘కాంప్రహెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌' (సీఎంపీ) కోసం ఆగారు.

సీఎంపీ ముసాయిదా సిద్ధం కావడంతో ఆ నివేదికను డీపీఆర్‌కు జోడించి సర్కారుకు అందజేశారు. దీని ఆధారంగానే సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిని కలిసి ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపట్టేలా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. డీపీఆర్‌లు పంపనున్నట్లు తెలిపారు. దీనిపై కేంద్రం సైతం సానుకూలంగా ఉన్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. 18 శాతం కేంద్రం నిధులతో మెట్రోరైలు ప్రాజెక్టులను వేర్వేరు నగరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యాలతో నిర్మిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో కేంద్రం భరించే వాటా సాధారణంగా 15 శాతం ఉంటుంది. హైదరాబాద్‌ మెట్రో రెండోదశలో 18 శాతం వరకు ప్రతిపాదిస్తున్నారు.

మెట్రోరైలు రెండోదశ డీపీఆర్​ మార్గాలు (ETV Bharat)

క్యాబినెట్‌ ఆమోదించాకే అనుమతి కోసం కేంద్రానికిి : రాష్ట్రం తన వాటాగా 30 శాతం భరించేందుకు సిద్ధపడుతోంది. 4 శాతం పీపీపీ పెట్టుబడులకు అవకాశం కల్పించాలనేది ఆలోచన. మిగిలిన 48 శాతానికి సంబంధించి జైకా వంటి సంస్థల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుంటారు. కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్య ప్రాజెక్టుపై రుణాలకు కేంద్రం పూచీకత్తు ఇస్తుందని అధికారులు అంటున్నారు. మెట్రో రెండోదశ డీపీఆర్‌ను తొలుత రాష్ట్ర మంత్రి మండలిలో చర్చించి ఆమోదించాలి. తదుపరి క్యాబినెట్‌ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అనంతరం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపిస్తారు. ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీని కలిసి మెట్రో రెండోదశకు ఆమోదం తెలపాలని కోరే అవకాశం ఉంది.

ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్‌మెంట్‌లో మార్పులు - రూ.32,237 కోట్లతో రెండో దశ పనులు - Airport Metro Alignment Change

దసరాలోపు మెట్రో విస్తరణ రూట్‌కు డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్రానికి పంపాలి : సీఎం రేవంత్​

ABOUT THE AUTHOR

...view details