Demand For Fruit Juices In Summer :రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మార్చిలోనే పలు జిల్లాల్లో ఉష్ఱోగ్రతలు 42 డిగ్రీలు దాటడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. వేసవి తాపం తీర్చుకోవడానికి ప్రజలుశీతల పానీయాలు, పండ్ల రసాలు తాగుతున్నారు. శరీరం కోల్పోయిన లవణాలు భర్తీ చేసుకునేందుకు ఎక్కువగా నిమ్మరసం(Lemon Juice) తాగుతున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనానికి కూల్‌డ్రింక్స్‌ను ప్రజలు ఎక్కువగా తీసుకుంటున్నారు.
Demand For Clay Pots In Summer :తోపుడుబండ్లపై భారీ కుండల్లో పుదీనా ఆకులతో కలిపిన నిమ్మరసాన్ని విక్రయిస్తున్నారు. పానీయాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని విక్రయదారులు చెబుతున్నారు. మరోవైపు మట్టికుండలకు కూడా ఈ వేసవిలో మంచి గిరాకీ ఉంది. కుండలో గ్లాసులు ముంచాల్సిన అవసరం లేకుండా నల్లా బిగించినవి అందుబాటులో ఉన్నాయి. మట్టితో చేసిన నీసా సీసాలు కూడా బాగా అమ్ముడుపోతున్నాయి. ఒకసారి ఈ బాటిల్‌లో నీరు నింపితే అరగంటలో చల్లగా మారతాయి. రోడ్ల పక్కన జూస్ సెంటర్లు ఎండకాలంలో ఎంతో ఉపయోగపడుతున్నాయని ప్రజలు అంటున్నారు.
"వేసవిలో నీళ్లు ఎక్కువగా తాగాలి. కేవలం మంచినీళ్లు తీసుకోవడమే కాకుండా ఓఆర్ఎస్ లాంటి ద్రావణాలు తాగాలి. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకుంటుండాలి. మసాలాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినకపోవడమే మంచిది. ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు ఉండేట్లుగా చూసుకోవాలి. షుగర్ వ్యాధి లేని వాళ్లు పండ్ల రసాలను కూడా తీసుకోవచ్చు. కూరగాయలు, సీజనల్ ఫలాలు తీసుకోవాలి. ఈ కాలంలో లభించేటువంటి కీర లాంటి పండ్లనీ తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు అన్నింటిని తీసుకోవడం ద్వారా సూర్య తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు"- శ్వేత, వైద్యురాలు