తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.55 చెల్లిస్తే నెలకు రూ.3వేల పెన్షన్ - ఈ పథకం గురించి తెలుసా? - PM SHRAM YOGI MANDHAN YOJANA

-అసంఘటిత రంగంలోని వారికి సామాజిక ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో పథకం -ఈ పథకానికి అర్హులు ఎవరు? కావాల్సిన డాక్యుమెంట్లు? దరఖాస్తు వివరాలు మీ కోసం

How to Apply PM Shram Yogi Mandhan Yojana
How to Apply PM Shram Yogi Mandhan Yojana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 15, 2025, 12:55 PM IST

How to Apply PM Shram Yogi Mandhan Yojana:కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అనుగుణంగా ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో ప్రధానమంత్రి శ్రమ్ యోగిమాన్​ధన్ యోజనకూడా ఒకటి. అసంఘటిత రంగంలోని వారికి సామాజిక ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. మరి ఈ పథకానికి అర్హులు ఎవరు? కావాల్సిన డాక్యుమెంట్లు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అసంఘటిత రంగ కార్మికులకు పింఛన్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది. 2019లో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్​ కింద 60 ఏళ్లు దాటిన అసంఘటిత రంగ కార్మికులు రూ.3వేల నెలసరి పింఛన్​ పొందుతారు. అయితే ఇందుకోసం కొంత మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది.

ఫీచ‌ర్స్:ప్ర‌ధాన‌మంత్రి శ్ర‌మ్ యోగి మ‌న్‌ధ‌న్ యోజ‌న ప‌థ‌కం స్వ‌చ్ఛంద పెన్ష‌న్ ప‌థ‌కం. 50:50 నిష్ప‌త్తిలో చందాదారుడు ఎంత జ‌మ‌చేస్తే అంతే స‌మానంగా కేంద్ర ప్ర‌భుత్వం జ‌మ‌చేస్తుంది. దీనిపై ఎలాంటి ఆదాయ ప‌న్ను వ‌ర్తించ‌దు. ప్ర‌తి చందాదారుడు ఈ ప‌థ‌కం కింద 60 ఏళ్ల త‌ర్వాత నెల‌కు రూ.3000 పెన్ష‌న్ పొందుతాడు. 60 ఏళ్ల కంటే ముందే మ‌ర‌ణిస్తే వారి భార్య లేదా భ‌ర్త ఈ ప‌థ‌కాన్ని కొన‌సాగించ‌వ‌చ్చు.

అర్హులు ఎవరు:

  • ఈ పథకంలో చేరే వారి వయసు 18 నుంచి 40 ఏళ్లు ఉండాలి.
  • నెలవారీ ఆదాయం రూ. 15,000 లోపు ఉండాలి.
  • ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ, ఎన్​పీఎస్​ సభ్యులుగా ఉంటే ఈ పథకంలో చేరడానికి అనర్హులు.
  • ఈ పథకంలో చేరాలంటే ఈ శ్రమ్ కార్డు (కార్మిక కార్డు) కచ్చితంగా ఉండాలి.

కావాల్సిన డాక్యుమెంట్లు:

  • బ్యాంక్ అకౌంట్
  • ఆధార్ కార్డు
  • రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్
  • ఈ శ్రమ్ కార్డు

ఎలా అప్లై చేసుకోవాలి: అర్హ‌త ఉన్న చందాదారులు వారికి స‌మీపంలో ఉన్న కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్స్ (సీఎస్‌సీ)కు వెళ్లి న‌మోదు చేసుకోవ‌చ్చు. ఈ సెంట‌ర్ల జాబితా ఎల్ఐసీ ఇండియా వ‌ద్ద ఉంటుంది. లేదంటే ఆన్​లైన్​లో కూడా అప్లై చేసుకోవచ్చు. అందుకోసం,

  • ఈ పథకానికి అప్లై చేయాలనుకునేవారు ముందుగా ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన అధికారిక వెబ్​సైట్​ ఓపెన్​ చేయాలి. https://maandhan.in/
  • హోమ్​ పేజీలో Login కాలమ్​పై క్లిక్​ చేస్తే కొత్త విండో ఓపెన్​ అవుతుంది. అందులో Self Enrollment ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • ఆ తర్వాత మీ మొబైల్​ నెంబర్​ ఎంటర్​ చేసి Proceed ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • మీ మొబైల్​ నెంబర్​కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్​ చేసి Proceed పై క్లిక్​ చేయాలి.
  • డాష్​బోర్డ్ మీద క్లిక్​ చేస్తే కొన్ని సర్వీసులు కనిపిస్తాయి. అందులో సర్వీస్​ కాలమ్​లో Enrollment ఆప్షన్​పై క్లిక్​ చేయాలి. అప్పుడు అక్కడ మూడు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో PM-SYMపై క్లిక్​ చేయాలి.
  • అప్పుడు మీకు ఈ శ్రమ్​ కార్డ్​ ఉందా అని స్క్రీన్​ కనిపిస్తుంది. ఉంటే ఎస్​ అని క్లిక్​ చేయాలి. ఈ శ్రమ్​ కార్డ్​ లేకుంటే ఈ పథకానికి అప్లై చేసుకునే అవకాశం ఉండదు.
  • ఇప్పుడు ఎన్​రోల్​మెంట్​ ఫారమ్​ ఫిల్​ చేయాలి. ఆ ఫారమ్​లో ఈ శ్రమ్​ UAN నెంబర్​, పేరు, పుట్టినతేదీ, ఫోన్​ నెంబర్​, జెండర్​, ఈమెయిల్​ ఐడీ, అడ్రస్​ సహా ఇతర వివరాలు ఎంటర్​ చేసి సబ్మిట్​ ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • ఆ తర్వాత బ్యాంక్​ ఖాతా, నామినీ వివరాలు టైప్​ ఎంటర్​ చేయాలి. తర్వాత Mandate ఫారమ్​ డౌన్​లోడ్​ చేసుకుని, దానిని అప్​లోడ్​ చేయాలి. ఆ తర్వాత మీ వయసుకు ఎంత ప్రీమియం చెల్లించాలో అంత పే చేయాలి. ఉదాహరణకు మీరు 18 ఏళ్ల వ‌య‌సులో ఈ ప‌థ‌కంలో చేరితే నెల‌కు రూ.55 జ‌మ‌చేయాల్సి ఉంటుంది. అంతే మొత్తంగా ప్ర‌భుత్వం కూడా జ‌మ‌చేస్తుంది. ఇక వ‌య‌సు పెరిగినా కొద్ది కాంట్రిబ్యూష‌న్ పెరుగుతూ వ‌స్తుంది.
  • పేమెంట్​ పూర్తయిన తర్వాత డాక్యుమెంట్​ని ప్రింట్ అవుట్ తీసుకోండి.

విత్​డ్రా రూల్స్​:

  • ప‌థ‌కంలో చేరిన త‌ర్వాత‌ ప‌దేళ్ల కంటే ముందే ఇందులోనుంచి నిష్క్ర‌మిస్తే, చందాదారుడు జ‌మ‌చేసిన దానికి మాత్ర‌మే బ్యాంక్ వ‌డ్డీతో క‌లిపి వ‌స్తుంది.
  • ప‌దేళ్ల త‌ర్వాత, 60 ఏళ్ల‌కు ముందే ఉప‌సంహ‌రించుకుంటే ఫండ్ ద్వారా సంపాదించిన వడ్డీ లేదా పొదుపు బ్యాంక్ వడ్డీ రేటులో ఏది ఎక్కువైతే దానితో పాటు, లబ్ధిదారుడి వాటా తిరిగి ల‌భిస్తుంది.

పింఛన్​దారులకు ఈపీఎఫ్‌ఓ గుడ్‌న్యూస్‌- ఇకపై ఎక్కడినుంచైనా పింఛన్​ తీసుకోవచ్చు

కేవలం 10 ఏళ్లు మాత్రమే ఉద్యోగం చేశారా? నెలవారీగా EPF పెన్షన్ ఎంత వస్తుందో తెలుసా?

మీకు ఉద్యోగం లేదా? కానీ పెన్షన్ కావాలా? అయితే ఈ స్కీమ్ మీకోసమే!

ABOUT THE AUTHOR

...view details