Hit and Run Case In Hyderabad: 'యాక్సిడెంట్ అంటే బైకో, కారో రోడ్డు మీద పడటం కాదు. ఓ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోవడం.' ఇది ఓ సినిమాలోని డైలాగ్. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో తాగిన మైకంలో మితిమీరిన వేగంతో కారు నడుపుతూ ఒకరి మరణానికి యువకులు కారణమయ్యారు.
పోలీసులు తెలిపిన ప్రకారం: నాగర్‌కర్నూల్‌కు చెందిన నలుగురు యువకులు కూకట్‌పల్లిలోని ఒక హాస్టల్లో ఉంటున్నారు. వారిలో ఓ యువకుడి పుట్టినరోజు సందర్భంగా ఫుల్‌గా మద్యం సేవించి కాల్ సెంటర్‌కు చెందిన కార్లో చార్మినార్‌కు వెళ్లి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ క్రమంలో మితిమీరిన వేగంతో వాహనం నడిపిస్తూ ఒక ఆటోను బలంగా ఢీకొనడంతో ఆటో పల్టి కొట్టి ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
అలంకరణ పనికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం - ముగ్గురు కూలీలు మృతి - Three killed in Accident At guntur
అయినా మద్యం మత్తులో ఉన్న ఆ యువకులు కారును ఆపకుండా వేగంగా పారిపోతుండగా, అదే సమయంలో అటునుంచి వెళ్తున్న నేరేడ్మెట్కు చెందిన అజయ్ అనే యువకుడు ఆ కారును ఆపే ప్రయత్నం చేశాడు. కానీ వారు ఆ కారును ఆపకుండా ఆ యువకుడిని ఢీకొట్టి అతని పైనుంచి వాహనాన్ని పోనిచ్చాడు. దీంతో కారు కింద పడి అజయ్ తీవ్ర రక్తస్రావంతో నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. నలుగురు యువకుల్లో ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం నాంపల్లి పోలీసులు గాలిస్తున్నారు.
Car Accident In Rangareddy: ఇటీవలి రంగారెడ్డి జిల్లా మణికొండలో ఓ కారు బీభత్సవం సృష్టించింది. కారులో ఉన్న మైనర్ బాలుడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ గోల్డెన్ టెంపుల్ వద్ద పార్కింగ్ చేసిన బైకర్లను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా 20 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. కారు డ్రైవింగ్ చేసిన మైనర్ బాలుడిపై స్థానికులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్ నడిపిన మారుతి బాలెనో వాహనం అతని తల్లి పేరు మీద ఉండటంతో ఆమెపై ఐపీసీ 279,337 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణలో రక్తమోడిన రహదారులు - వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి - Four Died in Road Accident
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఇద్దరు మృతి