తెలంగాణ

telangana

ETV Bharat / state

'దర్యాప్తు చేసుకోండి - అరెస్ట్​ చేయకండి' : హైకోర్టులో హరీశ్​రావుకు భారీ ఊరట - FORMER MINISTER HARISH RAO

బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావుకు హైకోర్టులో ఊరట - అరెస్ట్ చేయవద్దని ఉత్తర్వులు జారీ చేసిన న్యాయస్థానం

BRS MLA HARISH RAO
TELANGANA HIGH COURT (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 5, 2024, 1:18 PM IST

High Court on Harish Rao Petition : మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. హైదరాబాద్​లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు అంశంలో ఆయనను అరెస్టు చేయవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టవచ్చని జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు బీఆర్​ఎస్​ నేత హరీశ్‌రావు సహకరించాలని సూచించింది. ఆయనపై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్​ నేత చక్రధర్‌ గౌడ్‌కు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.

హైకోర్టులో హరీశ్​రావు క్వాష్​ పిటిషన్​ : పంజాగుట్ట పోలీస్​స్టేషన్‌లో స్థిరాస్తి వ్యాపారి, కాంగ్రెస్​ నేత జి.చక్రధర్‌ గౌడ్‌ రాజకీయ కక్షతోనే ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హరీశ్‌రావు బుధవారం (డిసెంబర్ 4) హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డారంటూ తనతో పాటు రాధాకిషన్‌రావు తదితరులపై చక్రధర్‌ గౌడ్‌ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలపై పోలీసులు ప్రాథమికంగా విచారణ చేయకుండానే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు.

ఫిర్యాదులో తనకు వ్యతిరేకంగా ఏమీ లేదని, దాన్ని కట్టుకథతోనే కంప్లైంట్​ ఇచ్చారన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తనను అరెస్ట్‌ చేస్తే తన రాజకీయ జీవితంతో పాటు ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బ తింటాయన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ అనేది ఎప్పుడో జరిగిన ఘటన అని తెలిపారు. అప్పుడెప్పుడో జరిగితే పోలీసులకు ఇప్పటి వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నారు. ఆయన పిటిషన్‌పై గురువారం (డిసెంబర్ 5న) తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది.

రాజకీయ కక్షతోనే : రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని హరీశ్​రావు పిటిషన్​లో పేర్కొన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా బెదిరేది, అదిరేది లేదని తేల్చి చెప్పారు. సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా వరుసగా ఏడుసార్లు గెలిచానని, తాను చట్టానికి కట్టుబడి ఉండే వ్యక్తినని కోర్టుకు విన్నవించారు. చట్ట ప్రక్రియను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. అంతేగాకుండా ఫోన్‌ ట్యాపింగ్‌పైనా చక్రధర్‌గౌడ్‌ గతంలో ఇదే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి, ఉపసంహరించుకున్నారని తెలిపారు.

'బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన మహేందర్ రెడ్డిని ప్రభుత్వ చీఫ్ విప్​గా నియమించడం రాజ్యాంగ విరుద్ధం'

'ఇందిరమ్మ రాజ్యమని ఊదరగొట్టడమే తప్ప - మహిళల భద్రతకు ప్రాధాన్యం లేదు' - Harish React to 2 Girls Rape Case

ABOUT THE AUTHOR

...view details