Manchu Manoj Latest Tweet Viral : మంచు ఫ్యామిలీలో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆన్‌లైన్‌లో ఎప్పుడూ ఎంతో యాక్టివ్‌గా ఉండే మంచు మనోజ్ తాజాగా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది. "కూర్చొని మాట్లాడుకుందాం అని అందులో పేర్కొన్నారు. నాన్న, ఇంట్లోని మహిళలు, ఉద్యోగులు, మిగిలిన వాళ్లను పక్కనపెట్టి మనమే చర్చించుకుందాం. ఏం అంటావు? నేను ఒంటరిగానే వస్తానని మాటిస్తున్నా. నీకు నచ్చిన వాళ్లను నువ్వు తీసుకురావచ్చు లేదా మనం ఆరోగ్యకరమైన డిబేట్ పెట్టుకుందాం. నీ #కరెంటు తీగ" అంటూ ఆ పోస్టులో మంచు మనోజ్ రాసుకొచ్చారు.
ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టులో మంచు మనోజ్ ఎవరిని ఉద్దేశించి పెట్టారో మాత్రం ఎక్కడా చెప్పలేదు. మరోవైపు మంచు కుటుంబంలో వివాదాల వేళ మనోజ్ పెట్టిన పోస్ట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.
నేను ఒంటరిగా వస్తా - నువ్వు ఎంతమందినైనా తెచ్చుకో : మనోజ్ ట్వీట్ వైరల్ (ETV Bharat) "ఇంట్లోకి నేను రానివ్వలేదని అనడం అసలు అది చెప్పడానికే హాస్యాస్పదంగా ఉంది. నేను ఎందుకు రానియ్యకుండా ఉంటాను. మీరందరు హ్యాప్పీగా రండి. ఇవన్నీ తప్పుడు ఆరోపణలే. స్టూడెంట్స్ కోసం నిలబడినందుకు ఇవన్నీ చేస్తున్నారు. నా పోరాటం ఎవరి మీద కాదండి. నా పోరాటం అంతా న్యాయం కోసమే. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు నిర్ణయించిన దాని ప్రకారమే మేము నడుచుకుంటాం"-మంచు మనోజ్, సినీ నటుడు
ఆ తరువాత రంగారెడ్డి కలెక్టర్‌ను నటుడు మంచు మనోజ్ కలిశారు. ఇటీవల చోటు చేసుకున్న పలు విషయాల గురించి కలెక్టర్‌తో చర్చించారు. తన ఆస్తుల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని కోరుతూ మోహన్‌బాబు కొన్ని రోజుల క్రితం జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. జల్‌పల్లిలోని తన నివాసాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను కొంతకాలంగా తిరుపతిలోనే ఉంటున్నానని తెలిపారు. అనంతరం ఆ నివాసంలో ఉంటున్న మనోజ్‌కు కలెక్టర్ నోటీసులు పంపించారు. ఈ క్రమంలోనే వివరణ ఇచ్చేందుకు మనోజ్ తాజాగా కలెక్టర్‌ను కలిసినట్లు తెలుస్తోంది.
ఇంటర్వ్యూలో మంచు విష్ణుకు ప్రశ్న : మరోవైపు కుటుంబ వివాదంపై మంచు విష్ణుకు ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. మంచు మనోజ్ పోరాటం దేనికోసం చేస్తున్నారని ప్రశ్న అడిగారు. దానికి విష్ణు స్పందిస్తూ 'నేను కన్నప్ప ప్రచారం కోసం ఈ ఇంటర్వ్యూకు వచ్చాను. దాని గురించి మాత్రమే అడగండి. ఆ వివాదం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు' అని అన్నారు. అయినా మనం చేసే చర్యలే మన వైఖరికి అద్దం పడతాయని చెప్పారు. జనరేటర్‌లో పంచదార, ఉప్పు పోస్తే అవి ఫిల్టర్ ప్రాసెసింగ్‌లోనే ఆగిపోతాయి తప్పితే, జనరేటర్ పేలదని సమాధానం ఇచ్చారు.
మంచు కుటుంబంలో ఆగని మంటలు - యూనివర్సిటీ గేటు ముందు లొల్లి
నాపై, నా భార్యపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు : డీఎస్పీకి మనోజ్ ఫిర్యాదు