తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం కేసులో కవిత మధ్యంతర బెయిల్​ పిటిషన్​ - నేడు విచారించనున్న కోర్టు - Hearing on Kavitha Bail Petition - HEARING ON KAVITHA BAIL PETITION

Hearing on MLC Kavitha Bail Petition in Rouse Avenue Court : కవిత మధ్యంతర బెయిల్​ పిటిషన్​పై నేడు రౌస్​ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. తన కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో కవిత తరఫు న్యాయవాది బెయిల్​ పిటిషన్​ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Hearing on MLC Kavitha Bail Petition
Hearing on MLC Kavitha Bail Petition in Rouse Avenue Court

By ETV Bharat Telangana Team

Published : Apr 1, 2024, 11:42 AM IST

Hearing on MLC Kavitha Bail Petition in Rouse Avenue Court :దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్​ పిటిషన్​పై ఇవాళ విచారణ జరగనుంది. తన మైనర్​ కుమారుడి పరీక్షల దృష్ట్యా ఈ నెల 16వ తేదీ వరకు బెయిల్​ మంజూరు చేయాలని గత నెల 26న ఆమె రౌస్​ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కవిత పిటిషన్​పై సమాధానం చెప్పాలని రౌస్​ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈడీకి నోటీసులు కూడా జారీ చేసింది.

Kavitha In Judicial Custody :దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో గత నెల 15న కవితను హైదరాబాద్​లోని తన నివాసంలో ఈడీ అరెస్టు (Kavitha ED Arrest ) చేశారు. మరుసటి రోజే దిల్లీలోని రౌస్​ అవెన్యూ కోర్టులో హజరుపరిచారు. ముందుగా కవితను 10 రోజలు కస్టడీకి ఈడీ కోరగా, న్యాయస్థానం 7 రోజులకు అనుమతి ఇచ్చింది.అనంతరం మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా, మూడురోజులకు అనుమతి ఇచ్చింది. ఈడీ కస్టడీ మార్చి 26న ముగియటంతో అదేరోజు రౌస్​ అవెన్యూ కోర్టులో సీబీఐ అధికారులు ఆమెను హజరుపరుచారు.

తిహాడ్ జైలుకు ఎమ్మెల్సీ కవిత - ఇంటి నుంచే భోజనం, మంచం, పరుపులకు వెసులుబాటు - Kavitha ED Custody Update

Delhi liquor Scam : కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నందున 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరారు. అప్పుడు కవిత కుమారుడికి పరీక్షల షెడ్యూల్​ విడుదల అయ్యిందని కోర్టుకు ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. మధ్యంతర బెయిల్​ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు కవితకు14 రోజుల జ్యుడిషియల్​ రిమాండ్​ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏప్రిల్​ 9 వరకూ ఈ రిమాండ్​ కొనసాగుతుండగా, ఆమెను తిహాడ్​ జైలుకు అధికారులు తరలించారు.

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు - కవిత ఈడీ కస్టడీ మరో మూడ్రోజులు పొడిగింపు - BRS Leader Kavitha ED Custody

వసతులు కల్పించని ఈడీ :ఈ నేపథ్యంలోనే కవిత దాఖలు చేసిన మేరకు మధ్యంతర బెయిల్​ పిటిషన్​పై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టనుంది. మరోవైపు తన విజ్ఞప్తి మేరకు జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టు ఆదేశించింది. అయినా తన విజ్ఞప్తి మేరకు అధికారులు అనుమతించటం లేదంటూ కవిత తరఫు న్యాయవాది రెండురోజుల క్రితం న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపైనా కోర్టు విచారణ చేపట్టనుంది.

దిల్లీ లిక్కర్ కేసులో తెరపైకి మరోపేరు - కవిత అల్లుడి పాత్రపై ఈడీ ఆరా - Delhi liquor scam updates

ABOUT THE AUTHOR

...view details