తెలంగాణ

telangana

ETV Bharat / state

తమలపాకులతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? - నిపుణులు చెప్పినట్లు చేస్తే ఆ సమస్యలన్నింటికీ చెక్! - Betel Leaves Benefits In Telugu - BETEL LEAVES BENEFITS IN TELUGU

Betel Leaves Benefits In Telugu : ఇంట్లో ఏ శుభకార్యమైనా, పూజలైనా అందులో పక్కాగా తమలపాకులు ఉంటాయి. ఇలా వాడే తమలపాకులో కొన్ని ఆరోగ్య సమస్యలు దూరం చేసే గుణాలుంటాయి అంటున్నారు నిపుణలు. మరి అవేంటో తెలుసుకోండి.

Health Benefits Of Betel Leaves In Telugu
Health Benefits Of Betel Leaves In Telugu (ETV Bharat)

By ETV Bharat Health Team

Published : Sep 24, 2024, 1:14 PM IST

Health Benefits Of Betel Leaves In Telugu :పూజలు, శుభకార్యాలకు, ముత్తైదువులకు వాయనమివ్వడానికి పూలు పండ్లతో పాటు ఎక్కువగా తమలపాకులు ఉపయోగిస్తారు. ఇంట్లో ఏ పండుగ అయినా, శుభకార్యం అయినా తమలపాకులు లిస్ట్‌లో ఉండాల్సిందే. ఇలా శుభప్రదంగా వాడే తమలపాకులు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలనూ దూరం చేస్తాయంటున్నారు నిపుణులు. ఇందులో వీటిలోని ఔషధ గుణాలే కారణమట. మరి అవేంటో తెలుసుకుందామా?

  • కొంతమందికి రోజూ తమలపాకులు తినే అలవాటు ఉంటుంది. అలా రోజూ తమలపాకు తినడం వల్ల శరీరంలో ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే తొలగిపోతాయి. పెద్ద గ్లాస్‌ నీటిలో కొన్ని తమలపాకులు వేసి, ఆ నీళ్లు సగమయ్యేంత వరకు మరిగించాలి. ఈ నీటిని ప్రతిరోజూ తాగడం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.
  • తమలపాకులు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. అలాగే చిగుళ్ల నుంచి వచ్చే బ్లీడింగ్‌ను ఆపి దంతాలను దృఢపరిచే గుణం తమలపాకులకు ఉంటుంది.
  • చర్మంపై అలర్జీ, దురద మొదలైన సమస్యలను తగ్గిస్తాయి తమలపాకులు. వీటిలో ఉండే యాంటీసెప్టిక్‌ గుణాలు చర్మ సమస్యలను దూరం చేయడానికి దోహదపడతాయి.

మునగ గింజల నూనెతో ఇలా ట్రై చేయండి- చుండ్రు, చర్మ సమస్యలు పరార్ అవ్వడం ఖాయం..! - Health Benefits Of Moringa Oil

  • బాలింతల రొమ్ముల్లో పాలు గడ్డకట్టుకుపోతుంటాయి. దాని వల్ల భరించలేని నొప్పి ఉంటుంది. ఆ సమయంలో తమలపాకులను కొద్దిగా వేడి చేసి ఛాతిపైన ఉంచితే ఉపశమనం లభిస్తుంది.
  • తమలపాకులను గాయాలు మానడానికి కూడా ఉపయోగిస్తారు. కొన్ని తమలపాకుల నుంచి తీసిన రసాన్ని గాయంపై రాసి, దానిపై మరో తమలపాకుని పెట్టి కట్టు కడతారు. ఇలా చేస్తే రెండు మూడు రోజుల్లో గాయం మానే అవకాశం ఉంటుంది.
  • తమలపాకులను నమిలి, ఆ రసాన్ని మింగడం వల్ల జీర్ణవ్యవస్థ సమస్యలు తగ్గుతాయి. అందుకే భోజనం చేసిన తర్వాత తాంబూలం వేసుకోవడం మంచిదంటారు.
  • గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో తమలపాకులు ఎంతో మేలు చేస్తాయి. ఛాతీలో నొప్పి, గుండెలో మంట వంటి సమస్యలతో బాధపడుతున్నావారు తమలపాకుల రసాన్ని తాగితే ఉపశమనం లభిస్తుంది.
  • వెన్నునొప్పితో బాధపడేవారు తమలపాకులకు కొద్దిగా నూనె రాసి, నొప్పి ఉన్న చోట మర్దన చేస్తే నొప్పి నుంచి ఉపశమం దొరుకుతుంది.

ABOUT THE AUTHOR

...view details