హైదరాబాద్‌లో గ్రాండ్ నర్సరీ మేళా 2024 Grand Nursery Mela 2024 in Hyderabad : జంట నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రాండ్ నర్సరీ మేళా వచ్చేసింది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో 15వ అఖిల భారత వ్యవసాయ, ఉద్యాన ప్రదర్శన - 2024 మొదలైంది. తెలంగాణ ఈవెంట్స్ అర్గనైజర్స్ సంస్థ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు జరగనున్న ఈ గ్రాండ్ నర్సరీ మేళాను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. పలు స్టాళ్లు కలియ తిరిగి మంత్రి పరిశీలించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి పేరెన్నికగన్న విత్తన, నర్సరీ, పనిముట్లు, యంత్రాలు, నగర సేద్యం సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం, హైడ్రోపొనిక్స్ టెక్నాలజీ సంస్థలు స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ జాతీయ మేళాలో మొత్తం 160 పైగా స్టాళ్లు(Stalls in Grand Nursery) కొలువు తీరాయి. హుస్సేన్‌సాగర తీరంలో ప్రశాంత వాతావరణం నడుమ ఎటు చూసినా పచ్చదనం, ఇట్టే కట్టిపడేసే అందమైన పూల మొక్కలు, అలంకరణ మొక్కలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
'మాకు మొక్కలంటే ప్రాణం - పొద్దున్నే లేచి వాటిని చూడకపోతే రోజు గడవదు'
All India Agriculture and Horticulture Exhibition- 2024: వాతావరణ మార్పుల నేపథ్యంలో సొంతంగా డాబాలు, అపార్ట్‌మెంట్లపై, ఖాళీ స్థలాల్లో రసాయన అవశేషాల్లేకుండా సహజ, సేంద్రీయ విధానంలో ఇంటి పంటలు పండించుకుంటూ నాణ్యమైన ఉత్పత్తులు ఆహారంలో భాగం చేసుకుంటున్న వేళ నగర సేద్యం, మిద్దెతోటల సాగుకు ఊతమిచ్చేందుకు ఈ మేళా(Plants Mela in Hyderabad) అత్యంత దోహదపడుతోంది. ఒకే చోట కూరగాయల విత్తనాలే కాకుండా పాలకూర వంటి ఆకుకూరల విత్తనాలు, మొక్కలు, ఇతర పండ్లు, పూల మొక్కలు, అలంకరణ మొక్కలు అందుబాటులో పెట్టి నిర్వాహకులు విక్రయిస్తుండటం చాలా సంతోషంగా ఉందని సందర్శకులు తెలిపారు.
Grand Nursery Mela 2023 : హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన గ్రాండ్ నర్సరీ మేళా
Grand Nursery Mela 2024 Last Date: విశ్వనగరం హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నగర సేద్యంతో పాటు పచ్చదనం పెంపు పట్ల సర్వత్రా శ్రద్ధ పెరిగిపోయింది. అవుట్‌డోర్, టెర్సస్ గార్డెనింగ్ అనేది ఒక అభిరుచిగా మారుతున్న తరుణంలో పెద్ద పెద్ద ఇళ్లు, కార్యాలయాల్లో అందంగా తీర్చిదిద్దికుంటున్నారు యజమానులు. బోన్సాయ్ వృక్షాల పెంపకం ఓ వ్యాపకంగా మారిపోయింది. అవసరమైన వర్మీ కంపోస్టు, సాయిల్ మిక్సింగ్, హైడ్రోపొనిక్ టెక్నాలజీ, విభిన్న ఆకృతుల్లో అందమైన కుండీలు అందుబాటులోకి రావడంతో ఔత్సాహికులు అవి వినియోగించుకుంటూ ఇళ్లు, కార్యాలయాలను అందంగా తీర్చిదిద్దుకుంటున్నారు.
భాగ్యనగరం వేదికగా.. నేటి నుంచి గ్రాండ్ నర్సరీ మేళా
"ఈ నర్సరీలో 160 స్టాల్స్‌లో 120 రకాల మొక్కలు ఉన్నాయి. అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఇది ఫిబ్రవరి 5 వరకు ఉంటుంది. పక్క రాష్ట్రాల్లో నుంచి కూడా అధిక సంఖ్యలో స్టాల్స్ రావడం సంతోషంగా ఉంది. గులాబీలోని రకాలు ఎక్కువగా వచ్చాయి."- మహ్మద్ ఖలీద్ అహ్మద్ జమీర్, తెలంగాణ ఈవెంట్స్ ఆర్గనైజర్స్ అధ్యక్షుడు
Plants in Grand Nursery Mela 2024 : రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన రంగాలకు సర్కారు పెద్దపీట వేసిన దృష్ట్యా రైతుల సౌకర్యార్థం దేశీయ, సంకర విత్తనాలు ఈ మేళాలో ప్రదర్శన, విక్రయాలు సాగుతున్నాయి. 2023 అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ముగింపు నేపథ్యంలో కొనసాగింపుగా చిరుధాన్యాల ఉత్పత్తులు, అదనపు విలువ జోడింపు, ఇతర అన్ని రకాల ఉత్పత్తులతో కూడిన నోరూరించే రుచులు కట్టిపడేస్తున్నాయి. తొలి రోజు పెద్ద ఎత్తున సందర్శకులు పోటెత్తడంతో హుస్సేన్‌సాగర్ తీరం పీపుల్స్ ప్లాజా ప్రాంగణం కళకళలాడుతోంది. ఈ సారి మిద్దెతోటల సాగుదారులు, టెర్రస్ ఔత్సాహిక మహిళలు, యువతులకు ఉచిత ప్రవేశం(Free Ticket at Grand Nursery for Women), విద్యార్ధులకు 50 శాతం రాయితీ నిర్వాహకులు ఇవ్వడంతో నర్సరీ మేళాకు సందర్శకుల రద్దీ భారీగా పెరిగింది.
Grand Nursery Mela 2023 : 'గ్రాండ్ నర్సరీ మేళా'కు హైదరాబాదీలు ఫిదా.. అరుదైన మొక్కలతో సెల్ఫీలు.. నచ్చిన మొక్కల కొనుగోళ్లతో సందడి