తెలంగాణ

telangana

ETV Bharat / state

సంక్రాంతి రద్దీకి తగ్గట్లు మారిన వందేభారత్‌ - విశాఖ ట్రైన్​కు అదనపు కోచ్‌లు - SOUTH CENTRAL RAILWAY

సంక్రాంతి పండుగ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే - విశాఖపట్నం-సికింద్రాబాద్‌-విశాఖపట్నం వందేభారత్‌కు 4 అదనపు కోచ్‌లు జత చేయనున్నట్లు ప్రకటన

COACHES INCREASED
VANDE BHARAT TRAIN (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 10, 2025, 6:50 PM IST

Additional Coaches in Vande Bharat Train : విశాఖపట్నం-సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగిస్తోన్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా అదనంగా కోచ్‌లను పెంచుతూ సౌత్‌ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఇప్పటివరకు 16 కోచ్‌లతో నడుస్తోన్న విశాఖ-సికింద్రాబాద్‌-విశాఖ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో అదనంగా మరో 4 కోచ్‌లను జత చేస్తున్నట్లు తెలిపింది. ఈ అదనపు కోచ్‌లు జనవరి 11వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. మరో 4 కోచ్‌లు పెంచడం ద్వారా ఇప్పటివరకు 1,128 మందికి ప్రయాణ సౌకర్యం ఉండగా, ప్రస్తుతం ప్రయాణికుల కెపాసిటీ 1,414కు చేరుకుంది.

పెరిగిన కెపాసిటీ : వందేభారత్‌ రైలుకు అదనంగా నాలుగు కోచ్‌లు జత చేశాక ఛైర్‌కార్‌ బోగీల సంఖ్య 14 నుంచి ఏకంగా 18కి పెరిగింది. ప్రయాణికుల సీటింగ్‌ కెపాసిటీ 1,024 నుంచి 1,336కు చేరుకుంది. ప్రస్తుతం ఉన్న రెండు ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ బోగీల సంఖ్యలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఈ రెండు బోగీల్లో కలిపి మొత్తంగా 104 మంది ప్రయాణం చేయొచ్చు. దీంతో రైలు మొత్తం సీటింగ్‌ కెపాసిటీ 1,414కి చేరినట్లు అయింది.

ABOUT THE AUTHOR

...view details