తెలంగాణ

telangana

ETV Bharat / state

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి నుంచి కిలో బంగారం చోరీ - ఎక్కడంటే? - Gold Theft In Secunderabad - GOLD THEFT IN SECUNDERABAD

Gold Theft In Secunderabad Monda Market : సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా బంగారం చోరీ జరిగింది. మోండా మార్కెట్లోని ఓల్డ్ జైల్​ఖానా ఎస్ ఎస్ జువెలర్స్ నుంచి క్లాక్ టవర్ వైపుకు కిలో బంగారంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దినేష్ నుంచి గుర్తుతెలియని ఇద్దరు దుండగులు బంగారంతో ఉన్న బ్యాగును అపహరించారు.

Gold Theft In Secunderabad
Gold Theft In Secunderabad Monda Market (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 18, 2024, 10:06 PM IST

Gold Theft In Secunderabad Monda Market: హైదరాబాద్‌లో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. ఇన్ని రోజులు ఒంటరి మహిళల మెడల్లో నుంచే చైన్‌లను దోచుకుపోతున్నారు అనుకుంటే, ఇప్పుడు పురుషులను సైతం వదలడం లేదు. ఎంత భద్రత ఉన్నా, ఎన్ని నిఘా నేత్రాలు ఉన్నా వారి పనిని వారు భయం లేకుండా కానిచ్చేస్తున్నారు.

కిలో బంగారం చోరీ : తాజాగా సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా బంగారం చోరీ జరిగింది. మోండా మార్కెట్లోని ఓల్డ్ జైల్ ఖానా ఎస్ ఎస్ జువెలర్స్ నుంచి క్లాక్ టవర్ వైపునకు కిలో బంగారంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న దినేష్ నుంచి గుర్తుతెలియని ఇద్దరు దుండగులు బంగారంతో ఉన్న బ్యాగును అపహరించారు. క్లాక్ టవర్ సమీపంలో ద్విచక్ర వాహనంపై బంగారంతో వెళుతున్న వారి నుంచి మరో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు బ్యాగ్​ను లాక్కుని పారిపోయారు. బ్యాగులో భారీగా బంగారు అభరణాలు ఉన్నట్లు తెలిసింది. ఘటనా స్థలానికి చేరుకున్న మోండా మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details