Wardhannapet Road Accident Today :నలుగురు యువకుల ప్రాణాలను బస్సు రూపంలో మృత్యువు కబలించింది. సదరు యువకుల నిర్లక్ష్యమే వారి ప్రాణాలను గాల్లో కలిపింది. వరంగల్ జిల్లాలోని ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఇంటర్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు వరుణ్ తేజ, సిద్దు, గణేష్, రనిల్ కుమార్‌లుగా పోలీసులు గుర్తించారు.
మృతిచెందిన ఇంటర్ విద్యార్థులు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం : వర్ధన్నపేటకు చెందిన పొన్నం గణేశ్, ఇల్లంద గ్రామానికి చెందిన మల్లేపాక సిద్ధు, వరుణ్ తేజ్, పొన్నాల రనిల్ కుమార్‌లు ఒకే ద్విచక్ర వాహనంపై ఇల్లంద నుంచి వర్ధన్నపేట వైపు వెళ్తున్నారు. ఓ మూలుపు మలుపు వద్ద ఎదురుగా బస్సు వస్తున్న విషయాన్ని వీరు గమనించలేదు. బస్సు డ్రైవర్ కూడా గమనించకపోవడంతో బైక్‌ను బలంగా ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ బస్సు హనుమకొండ జిల్లాలో బుధవారం నిర్వహించిన ఎన్నికల సభకు ప్రజలను తరలించి తిరిగి ఖాళీగా వెళుతోంది.
కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం - ఆరుగురు మృతి - Kodad Road accident today
Warangal Road Accident Today : ఈ ఘటనలో ముగ్గురు స్పాట్ డెడ్ కాగా, మరో విద్యార్థి చికిత్స పొందుతూ మరణించాడు. ఇందులో గణేశ్ అనే విద్యార్థి బుధవారం వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఈ క్రమంలోనే అతను తన ముగ్గురు స్నేహితులతో కలిసి సాయంత్రం విందు చేసుకొని ఒకే ద్విచక్ర వాహనంపై తిరిగి ఇళ్లకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాద తీవ్రతకు నలుగురు విద్యార్థులు సుమారు 50 మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా ఎగిరి పడినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా వారి తల్లిదండ్రులకు ఒక్కరే కుమారులని స్థానికులు చెప్పారు. ఇల్లంద గ్రామానికి చెందిన ముగ్గురు ఒకే రోజు చనిపోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలం వద్ద మలుపు ఉండటం, రెండు వాహనాలు వేగంగా రావడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోుదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
కేసీఆర్ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం - సడెన్ బ్రేక్ వేయడంతో ఒకదాన్నొకటి ఢీకొన్న కార్లు - KCR Convoy Small Accident
అమెరికాలో రోడ్డు ప్రమాదం - ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి - Telangana Students Died In America