Boat Racing for Fish hunt Place in Ambedkar Konaseema : ఏంటి ఒకరికొకరు పోటీ పడి మరి పడవ నడుపుతున్నారు. ఇప్పుడేం పోటీలు ఉన్నాయి అని అనుకుంటున్నారా ? అవును నిజమే. కానీ సరదా కోసం కాదు, వారు ఉపాధి కోసం ఈ పోటీలు. పడవ పోటీలకు వారి ఉపాధికి సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా ? ఇది తెలియాలి అంటే ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే. ఏపీలో గోదావరి నదీపాయల్లో మత్స్య సంపదను వేటాడాలంటే మత్స్యకారులు కొన్ని హద్దులను ఏర్పాటు చేసుకుంటారు. నిర్దేశించిన ప్రాంతంలో చేపల వేట సాగించాలంటే ఎవరైనా సరే ఈ పోటీలో పాల్గొని గెలవాల్సిందే.
ఈ నేపథ్యంలో పడవల పోటీలను నిర్వహిస్తారు. ముందుగా వారు ఏ ప్రాంతానికి చేరుకుంటే అక్కడి వరకు వేటసాగించేందుకు అర్హలు అవుతారు. అంతకమించి పై ప్రాంతంలో వేట సాగిచకుండా నిషేధం విధిస్తారు. ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈ పడవ పోటీలను నిర్వహించారు. ముమ్మిడివరం నియోజవర్గంలోని వృద్ధ గౌతమి, గౌతమీ గోదావరి, గోదావరి పాయలు ప్రవహిస్తాయి. వీటిలో మత్స్య సంపదను వేటాడేందుకు బలుసుతిప్పలో పడవల పోటీలను ఏర్పాటు చేశారు. దాదాపు 40 పడవుల్లో తమ వేట స్థలాల కోసం మత్స్యకారులు పోటీ పడ్డారు. పిల్లంక, యానం, పోలవరం, మసకపల్లి, కుండలేశ్వరం తదితర ప్రాంతాలోని గోదావరిలో ఈ పోటీ జరిగింది.