Fires In Damagundam Forest Area :వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండంలోని అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో అడవిలో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. అయితే మంటలకు కారణాలు తెలియరవడంలేదు. నిన్న మధ్యాహ్నం నుంచి అడవిలో మంటలను గమనిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. దీంతో పోలీసులు, అటవీ, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. ఇటీవల అటవీ ప్రాంతాన్ని నేవీ రాడార్ అధికారులు మ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎంతమేర అటవీ ప్రాంతం నష్టమైంది అనే విషయాన్ని అధికారులు తేల్చాల్సి ఉంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Fires In The Nallamala Forest At Amrabadఅటవీ ప్రాంతంలో కార్చిర్చు రేగడం ఇది ఒక్కసారే కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. కొద్ది రోజుల క్రితం నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటలు అమ్రాబాద్, దోమలపెంట రేంజ్ పరిధిలోని గ్రామానికి సమీపాన ఉన్న అడవి నుంచి కృష్ణా నదికి సమీపాన ఉన్నటువంటి వజ్రాల మడుగు, తాటి గుండాల్లో భారీ స్థాయిలో మంటలు వ్యాపించాయి. ప్రమాదాన్ని గుర్తించిన ఫైర్ సిబ్బంది, సహాయంతో మంటలను అదుపు చేశారు.