Farmers Grow Different Kinds of Crops in One Season and Earning Profits : ఒకప్పుడు రైతులు వరి, పసుపు, మొక్కజొన్న, ఎర్రజొన్న లాంటివే ఎక్కువగా పండించే వారు. లాభాలు వచ్చినా, నష్టం వాటిల్లినా ఇవే పంటలు వేసేవారు. కానీ ఇప్పుడు వారి ఆలోచనలు మారుతున్నాయి. ఎన్ని ఎకరాల్లో సాగు చేశామన్నది కాదు, ఎంత లాభాలు గడించామన్నదే పాయింట్ అన్నట్లుగా పంటలు వేస్తున్నారు. రెండు ఎకరాలైనా నిత్యం చేతికి డబ్బు అందే పంటలవైపు ఆసక్తి చూపుతున్నారు. వినూత్న పంటలు వేసి లాభాలు అర్జిస్తున్నారు. సరికొత్త విధానాలు అనుసరిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
Farmers Grow Different Kinds of Crops in One Season and Earning Profits (ETV Bharat) వరి, పసుపు, మొక్కజొన్న, ఎర్రజొన్న పండించే రైతులు ధరలు లేక, దిగుబడి రాక నష్టాల పాలవుతూ తిరిగి అప్పులు చేస్తుండడం, వాటిని తీర్చలేక కొంతమంది రైతులు తనువు చాలించడం ఇవన్నీ చాలా ఏళ్లుగా జరుగుతున్న సంఘటనలు. అదృష్టవశాత్తు అధిక దిగుబటి వస్తేనో, లేక మార్కెట్ ధర పెరిగితేనో తప్ప నష్టాలు పూడ్చుకొని లాభాల్లోకి అడుగుపెట్టరు. అదే ఇంకా చిన్నకారు రైతులకు ఏళ్ల సమయం పడుతుంది. నిత్యం మార్కెట్‌కు తరలించే పంటలు పండిస్తే ఒకసారి కాకపోయినా మరో పంట చేతికి అందుతుంది. ప్రజలకు అవసరమయ్యే పండ్లు, కూరగాయలు పండిస్తే లాభాలు తప్పకుండా వస్తాయి. ఇప్పులు ఇదే రైతుల ఆలోచనలను మారుస్తోంది.
Farmers Grow Different Kinds of Crops in One Season and Earning Profits (ETV Bharat) YUVA : ఈ యువకుల వృత్తి సాఫ్ట్‌వేర్ ప్రవృత్తి ఆర్గానిక్ ఫార్మింగ్ - సేంద్రీయ సాగులో రాణిస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు - Special Story On SOFTWARE FARMERS
ఏడాది కాలం పాటు పంట వచ్చేలా :మార్కెట్‌లో ధర ఎక్కువ పలుకుతున్న, ఎక్కువ కాలం పంట చేతికి వచ్చే పంటలపై రైతులు దృష్టి సారిస్తున్నారు. అందులో అంతర్ సాగుతో ఏడాది పొడవునా లాభాలు వచ్చేలా అడుగులు వేస్తున్నారు. తైవాన్ జామ, డ్రాగన్ ఫ్రూట్, కశ్మీర్ యాపిల్, ఉల్లిగడ్డ, తీగజాతి టమాట, బెర్రి, కాకర, వంకాయ, సోరకాయ, కొత్తిమీర, బీరకాయ, ఉల్లి, ఆకుకూరలను సాగు చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మోతెలో వరి సాగును తగ్గించి ప్రత్యేక కుంటలు నిర్మించి చేపల పెంపకం ప్రారంభించారు ఒక రైతు. ఒకే నెలలో మూడు, నాలుగు రకాల సాగు చేసి ఒకదాని వెంట మరో పంట మార్కెట్‌కు తరలించడం ద్వారా లాభాలు పొందడమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నారు.
Farmers Grow Different Kinds of Crops in One Season and Earning Profits (ETV Bharat) "మూడు ఎకరాల్లో సోరకాయ, కాకర, బీరకాయ, పందిరి టమాటా సాగు చేస్తున్నా. దిగుబడిని నేరుగా ఓ ప్రైవేట్ కంపెనీకి సరఫరా చేస్తున్నాను. మిగతా పంటను ఆర్మూర్ మార్కెట్, అంకాపూర్ మార్కెట్, నా స్నేహితుల వాట్సప్ గ్రూప్ ద్వారా మార్కెటింగ్ చేస్తూ కస్టమర్లను పెంచుకుంటున్నా. పసుపు, మొక్కజొన్న, వరి కంటే కూరగాయల ద్వారా మూడింతల ఆదాయం లభిస్తుంది. ఈ పంటల సాగు కోసం గల్ఫ్‌లో మంచి జీతం వచ్చే ఉద్యోగం వదులుకున్నాను. నా సాగు పద్ధతిని చూసేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. వారికి మెళకువలు నేర్పుతున్నాను." - అజయ్, రైతు
వాట్ ఏ థాట్ : ఉన్న పొలం ఎకరం - పండించేది గుంటగుంటకో రకం
ఎకరం భూమిలో 60 రకాల పంటలు సాగు - మల్టీలేయర్ ఫార్మింగ్‌తో ఏటా రూ.8లక్షలు సంపాదిస్తున్న యువరైతు! - Multi Layer Farming Model