ETV Bharat / entertainment

'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్​లో అల్లు అర్జున్ ఎమోషనల్ స్పీచ్ - ఫ్యాన్స్​ను ఉద్దేశించి బన్నీ ఏమన్నారంటే?

ఆ రెండు సినిమాల్లా 'పుష్ప' తెలుగు వారికి మంచి పేరు తెచ్చిపెట్టాలి : 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్​లో అల్లు అర్జున్

Pushpa
Allu Arjun (Pushpa 2 Pre Release Event)
author img

By ETV Bharat Telugu Team

Published : 20 hours ago

Allu Arjun Speech In Pushpa 2 Pre Release Event : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ లీడ్​ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'పుష్ప 2'. ఇప్పటికే పార్ట్​ 1తో అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ప్రీక్వెల్​గా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ తాజాగా హైదరాబాద్‌లోని పోలీస్‌గ్రౌండ్స్‌ (యూసఫ్‌గూడ)లో ఓ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్​ను నిర్వహించింది. దీని స్టార్ డైరెక్టర్ రాజమౌళి స్పెషల్ గెస్ట్​గా వచ్చారు. ఇక ఈ ఈవెంట్​లో బన్నీ తన ఫ్యాన్స్​ కోసం ఓ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.

"నా అభిమానులను నేను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. వారంటే నాకు అంత పిచ్చి. ఇక మాపై నమ్మకంతో ఖర్చు విషయంలో ప్రోడ్యూసర్లు ఎక్కడా రాజీ పడలేదు. ఈ సినిమాలో ఫహద్‌ ఫాజిల్‌ అద్భుతంగా నటించారు. ఫస్ట్ హాఫ్​ అయిన తర్వాత మీరంతా స్టన్‌ అవుతారు. శ్రీలీల డ్యాన్స్‌ చూస్తే, భలే క్యూట్‌గా అనిపిస్తుంది. ఆమెతో వర్క్ చేసిన తర్వాత తన టాలెంట్‌ ఏంటో నాకు తెలిసింది. నేను ఐదేళ్లుగా శ్రీవల్లితో పనిచేస్తున్నాను. ఇక షూటింగ్‌లో ఆమె లేని రోజులు నేను అసలు ఊహించలేను. రాత్రి 2గంటల వరకూ 'పీలింగ్స్‌' సాంగ్‌ చేసి, మళ్లీ పొద్దున్నే ఎనిమిదిన్నరకల్లా సెట్స్​కు వచ్చేసేది. తను వరుసగా రెండు రోజుల పాటు సరిగా నిద్రకూడా పోలేదు. ఇటువంటి అమ్మాయిలతో పనిచేయాలన్న ఫీలింగ్‌ కలిగించింది" అంటూ తన కో స్టార్స్​ను పొగడ్తలతో ముంచెత్తారు అల్లు అర్జున్.

ఇక ఇదే వేదికపై డైరెక్టర్ సుకుమార్ గురించి అలాగే తనతో వర్క్​ చేసిన అనుభవాలను పంచుకున్నారు బన్నీ. సినిమా కోసం సుకుమార్ పడిన కష్టం గురించి చెప్పుకొచ్చారు. అలాగే తన ఫ్యాన్స్​ను ఉద్దేశించి ఎమోషనల్​గా మాట్లాడారు.

"పుష్ప' సుకుమార్‌ సినిమా. ఇంత మంచి డైరెక్టర్ తెలుగులో ఉన్నారా? అన్న ఫీలింగ్ కలిగిస్తారు. నేను ప్రమోషన్స్‌కు వెళ్తుంటే, ఆయన మాత్రం ఈ సినిమాను పూర్తి చేయడానికి కష్టపడుతూనే ఉన్నారు. ఈ మూవీకి కష్టపడ్డామనే మాట చాలా చిన్నది. ఐదేళ్లు ప్రతి ఒక్కరూ తమ జీవితాలు పెట్టేశారు. సుకుమార్‌ లేకపోతే, నేను లేను. 'ఆర్య' లేకపోతే నేను లేను. షూటింగ్‌లో సుకుమార్‌ పడిన కష్టం చూసి, ఈ సినిమా కచ్చితంగా ఆడాలని నేను కోరుకున్నా. 'పుష్ప2' కోసం శ్రమించిన వారి జీవితాలకు తగిన విలువ ఉండాలంటే ఈ సినిమా కచ్చితంగా ఆడాలి. 'ఆర్ఆర్‌ఆర్‌', 'బాహుబలి' లాంటి సినిమాలు తెలుగు వారికి మంచి పేరు తెచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ 'పుష్ప2' ఆ పేరు తేవాలి. అందుకే ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. 12 వేల స్క్రీన్‌లు, 80 దేశాల్లో 'పుష్ప2' రానుంది. మాకు చాలా గర్వంగా ఉంది. వరల్డ్ వైడ్​గా ఉన్న భారతీయుల కోసం మేము ఒక వేడుకను తీసుకొస్తున్నాం. అదే 'పుష్ప: ది రూల్‌'. ఇంతకంటే ఈ జీవితానికి ఇంకేం కావాలి. 12 వేల స్క్రీన్‌లలో ఏ ఇండియన్‌ సినిమా కూడా ఇలా రాలేదు. చాలా గర్వంగా ఉంది. నా ఆర్మీ (అభిమానులు)కి థ్యాంక్స్. నా కష్టం నా అభిమానులకు అంకితం" అని అల్లు అర్జున్‌ మాట్లాడారు.

'అప్పుడు బన్నీతో అలా చెప్పా - కానీ ఇప్పుడు అవసరం లేదు' : రాజమౌళి

26 నిమిషాల్లోనే 'పుష్ప 2' అదిరే ఘనత - రిలీజ్​కు ముందే 9 రికార్డులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.