Best Places to Taste Ramadan Foods in Hyderabad:ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఈ ఏడాది(2024) మార్చి 12 నుంచి ప్రారంభమైంది. ఇక రంజాన్ మాసం మొదలుకావడంతో హైదరాబాద్‌లో వీధులన్నీ ముఖ్యంగా పాతబస్తీ సందడిగా మారింది. నగరంలోని ఏ వీధి చూసిన రంజాన్ ప్రత్యేక వంటకంగా చెప్పుకునే హాలీమ్ సెంటర్లు దర్శనమిస్తున్నాయి. అయితే, ఒక్క హాలీమ్ మాత్రమే కాదు.. కబాబ్‌ల నుంచి బిర్యానీల వరకు ఎన్నో రుచికరమైన వంటకాలు ఈ మాసంలో లభిస్తాయి. అలాంటి రుచికరమైన రంజాన్(Ramadan 2024)ఫుడ్స్‌ను అందించే టాప్ 10 ఫేమస్ హోటల్స్ హైదరాబాద్‌లో ఉన్నాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హోటల్ షాదాబ్ : మీరు రంజాన్ మాసంలో రుచికరమైన ఆహారాల పదార్థాలను తినాలంటే తప్పక సందర్శించాల్సిన ప్రదేశం.. పాతబస్తీలో ఉన్న హోటల్ షాదాబ్. ఇక్కడ చికెన్ కబాబ్‌ల నుంచి మటన్ బిర్యానీ, హాలీం వరకు అనేక రకాల ఫుడ్స్ లభిస్తాయి. ఇవి టేస్ట్‌లో నిజాం కాలం నాటి వంటకాలను గుర్తు చేస్తాయి. ఇక ఇక్కడ వెజ్ లవర్స్ కోసం ప్రిపేర్ చేసే మిర్చి కా సలాన్ కూడా చాలా ఫేమస్.
- అడ్రస్ : మదీనా సర్కిల్, హైకోర్టు రోడ్, చార్మినార్, ఘాన్సీ బజార్, హైదరాబాద్.
- టైమింగ్స్ :6 am - 12 am.
హోటల్ నయాబ్ : ఇది కూడా నగరంలో రంజాన్ ఫుడ్స్ లభించే ప్రదేశాలలో మరొక అత్యంత ప్రజాదరణ పొందిన ప్రదేశం. ఇక్కడ లభించే హాలీమ్ ఎంతో రుచికరంగా ఉంటుంది. అలాగే ఛార్ కోని నాన్కు కూడా ఈ హోటల్ చాలా ప్రసిద్ధి చెందింది.
- అడ్రస్ :నయాపుల్ రోడ్, MI (Xiaomi) షోరూమ్ ఎదురుగా, నాసిర్ కాంప్లెక్స్, చట్టా బజార్, దారుల్షిఫా, హైదరాబాద్.
- ఓపెనింగ్ టైమింగ్స్ : 5am -12:30am.
షా గౌస్ :హైదరాబాద్‌లోని అత్యంత ప్రసిద్ధి చెందిన రెస్టారెంట్లలో ఒకటి షా గౌస్. మొఘలాయి వంటకాలకు ఇది చాలా ఫేమస్. అలాగే రంజాన్ మాసంలో లభించే ఫుడ్స్ కూడా ఇక్కడ ఎంతో ప్రత్యేకం. రంజాన్ మాసంలో ఈ ప్రదేశం రాత్రిపూట కూడా చాలా బిజీగా ఉంటుంది. షా గౌస్లో లభించే మటన్ హాలీమ్ చాలా ఫేమస్. అలాగే ఖుబానీ కా మీఠా, షాహీ తుక్డా, ఫిర్నీ వంటి వంటకాలు ఇక్కడ ఎంతో ప్రాచుర్యం పొందాయి.
- ఇది ఉన్న ప్లేస్ : కరాచీ బేకరీ సమీపంలో, రూప్ లాల్ బజార్, సయ్యద్ అలీ చబుత్రా, జోహ్రా కాలనీ, శాలిబండ, హైదరాబాద్.
- ఓపెనింగ్ టైమింగ్స్ : 12:30 pm - 12:30 am.
పిస్తా హౌస్ : ఇది కూడా రంజాన్ మాసంలో లభించే ప్రత్యేక ఫుడ్ మెనూను అందిస్తోంది. ఇక్కడ షాహీ తుక్డా, డబుల్ కా మీఠా, షీర్ ఖుర్మా వంటి ఎన్నో రకాల వంటకాలు ఫేమస్. వీటితో పాటు రంజాన్ నెలలో ఇక్కడ ప్రిపేర్ చేసే రంగురంగుల బర్ఫీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
- ఇది ఉన్న ప్లేస్ : చార్మినార్ రోడ్, శాలిబండ, హైదరాబాద్.
- ఓపెనింగ్ వేళలు : 11 am - 11:30 pm.
ప్రిన్స్ హోటల్ : మీరు రంజాన్ నెలలో తప్పక సందర్శించాల్సిన మరో ప్రదేశం.. ప్రిన్స్ హోటల్. ఇక్కడ ఖిచ్డీ ఖట్టా ఖీమా చాలా ఫేమస్. దీని కోసం నగరవాసులు క్యూ కడతారు. అత్యంత ప్రసిద్ధ రంజాన్ స్పెషాలిటీలు/స్నాక్స్‌లలో ఒకటిగా పేరుగాంచిన చికెన్ 65ని ప్రిన్స్ హోటల్ అందిస్తోంది. ఇక్కడ లభించే ఆ స్నాక్ ఎంతో ప్రత్యేకం.
- ఇది ఉన్న ప్రాంతం :మస్జిద్ రోడ్, రాయల్ కాలనీ, మెహదీపట్నం, హైదరాబాద్.
- ఓపెనింగ్ టైమింగ్స్ :5 am - 12 am.