తెలంగాణ

telangana

ETV Bharat / state

స్కాన్​ చేస్తే చాలు బండికి ఛార్జింగ్‌ - కొత్త ఆదాయ మార్గంగా ఈవీ పాయింట్​ - EV CHARGING THROUGH QR CODE

క్యూఆర్‌ కోడ్‌తో ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ యూనిట్‌ - వాహన యజమానులకు ప్రత్యేక యాప్‌

QR CODE EV CHARGING UNITS
Charging Unit for Electric Vehicles by QR Code (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 6, 2024, 3:44 PM IST

Charging Unit for Electric Vehicles by QR Code :ప్రస్తుతందేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకం రోజురోజుకు పెరగుతోంది. ఈ నేపథ్యంలో అందుకు తగిన ఛార్జింగ్​ పాయింట్లు సైతం లేకపోవడంతో సమస్యగా మారుతోంది. ఇంటి దగ్గర ఛార్జింగ్‌ పెట్టుకున్నా మార్గమధ్యలో ఛార్జింగ్‌ అయిపోతే ఎలా అన్న సమస్యే ఇప్పుడు చాలా మంది వాహనదారుల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రస్తుతం పలుచోట్ల చిన్నచిన్న ఛార్జింగ్​ యూనిట్లు ప్రత్యేక పరిజ్ఞానంతో వస్తున్నాయి. హైదరాబాద్​ ఎన్టీఆర్‌ మార్గ్‌లో గురువారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన విజయోత్సవాల సభ ప్రాంగణంలో రవాణాశాఖ ఎలక్ట్రిక్‌ వాహనాల స్టాల్‌ను ఏర్పాటు చేసింది. అక్కడ ఎలక్ట్రిక్‌ ఆటోతోపాటు స్కాన్​ చేసి డబ్బులు చెల్లిస్తే ఛార్జింగ్​ అయ్యే ఛార్జింగ్‌ యూనిట్‌ను ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పరిశీలించారు.

క్యూఆర్‌ కోడ్​ ఛార్జింగ్‌ ఈవీ పాయింట్​ను చూపిస్తున్న థండర్‌ ప్లస్‌ సీఈవో రాజీవ్‌ (ETV Bharat)

అన్ని రకాల వాహనాలకు : క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి డబ్బులు చెల్లిస్తే ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఛార్జింగ్​ అయ్యేలా దీన్ని రూపొందించారు. ఈ ఛార్జింగ్​ యూనిట్​ను థండర్‌ ప్లస్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూపొందించింది. గతంలో ఎస్డీడీ బూత్​ బిజినెస్​లాగే ఈవీ ఛార్జింగ్​ యూనిట్​ సరికొత్త ఆదాయ మార్గం అని థండర్‌ ప్లస్‌ సొల్యూషన్స్‌ సీఈవో రాజీవ్‌ తెలిపారు. దీని నిర్వహణకు మనుషులు అక్కర్లేదని, దీన్ని ఇంటి దగ్గర కూడా ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు.

సొంత అవసరాలకే కాకుండా ఇతరులకు, ఇంటికి వచ్చే బంధువుల ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఈ ఛార్జింగ్​ యూనిట్​ సదుపాయాన్ని అందించొచ్చని థండర్‌ ప్లస్‌ సొల్యూషన్స్‌ సీఈవో రాజీవ్‌ వివరించారు. టూ వీలర్​, త్రీ వీలర్​, కార్లకు కూడా ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. షార్ట్​ సర్క్యూట్​తో వైర్లు కాలిపోడం వంటి సమస్యలు కూడా ఉండవని తెలిపారు. ఈ ఛార్జింగ్​ యూనిట్​ ధర రూ.15 వేలు ఉందని, ప్రస్తుతం ఇది తొమ్మిది, పది వేల రూపాయలకే ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు రాజీవ్‌ అన్నారు.

New EV Policy in Telangana :మరోవైపు దిల్లీ మాదిరిగా హైదరాబాద్ కాలుష్యం బారిన పడకుండా రాష్ట్ర ప్రభుత్వం సైతం చర్యలు చేపడుతోంది. కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్​ను మార్చే దిశగా గత నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీని తీసుకొచ్చింది. ఈ ఈవీ పాలసీ డిసెంబరు 31, 2026 వరకు కొనసాగుతుందని ఇప్పటికే రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణలో ఎలక్ట్రిక్​ వాహనాలకు పరిమితి లేదని, రిజిస్ట్రేషన్​ టాక్స్​లోనూ వందశాతం మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు.

హైదరాబాద్​లో కాలుష్యానికి చెక్​! - నేటి నుంచి కొత్త 'ఈవీ' పాలసీ - వాటికి నో టాక్స్

ఎలక్ట్రిక్ వాహనాలు వాడుతున్నారా? - చార్జింగ్​కు రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు బంఫర్ ఆఫర్!

ABOUT THE AUTHOR

...view details