తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో అల్పపీడనం ఎఫెక్ట్​ - రేపు ఆ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు - SCHOOLS HOLIDAYS IN AP

ఆ రెండు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు - భారీ వర్ష సూచన దృష్ట్యా కలెక్టర్లు నిర్ణయం

Educational Institutions Holidays in AP
Educational Institutions Holidays in AP (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 15, 2024, 8:35 PM IST

AP Schools Holidays Latest Update : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమ క్రమంగా బలపడుతోంది. దీని ప్రభావంతో ఏపీలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు కంట్రోల్‌రూమ్స్‌ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్ష సూచన దృష్ట్యా తిరుపతి, చిత్తూరు కలెక్టర్లు ఈ మేరకు సెలవు నిర్ణయాన్ని తీసుకున్నారు.

మరోవైపు తిరుపతికి భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ శ్యామలరావు అధికారులను ఆదేశించారు. విపత్తు నిర్వహణ ప్రణాళికపై టీటీడీ అడిషనల్ ఈఓ సి.హెచ్​.వెంకయ్య చౌదరితో కలిసి ఆయన అధికారులతో వర్చువల్ మీటింగ్​ ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందనే ఐఎండీ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో అధికారులందరూ విపత్తును ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని ఈవో పేర్కొన్నారు. గతంలో భారీ కొండ చరియలు విరిగి పడిన ఘటనతో టీటీడీ బోర్డు 700 పేజీల విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించిందని చెప్పారు. ఈ ప్రణాళిక బాగుందనీ, దీన్ని మరింత మెరుగు పరచాల్సిన అవసరం ఉందని అధికారులకు ఈవో సూచించారు.

TTD On Heavy Rains Effect :ఈఓ స్థాయిలో విపత్తుల నివారణ ఎగ్జిక్యూటివ్ కమిటీ, అడిషనల్ ఈఓ ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ సమన్వయ కమిటీ ఉందని శ్యామలరావు తెలిపారు. అగ్నిమాపక శాఖ, హెల్త్​ డిపార్ట్​మెంట్​, విజిలెన్స్ విభాగం, ఇతర కీలకమైన శాఖల విభాగాధిపతులు, తమ సిబ్బందితో డిజాస్టర్ మేనేజ్​మెంట్​​ రెస్పాన్స్​ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొండ చరియలపై స్పెషల్​ ఫోకస్​ ఉంచాలని ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో సూచించారు.

కరెంట్​కు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని శ్యామలరావు తెలిపారు. విద్యుత్‌ అంతరాయం ఏర్పడితే జనరేటర్లు నడపడానికి ముందస్తు జాగ్రత్తగా తగినంత డీజిల్ వంటి ఇతరత్రా ఇంధనాన్ని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఐటీ విభాగం భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదాల కార్యాకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు ముందుగా చేసుకోవాలని చెప్పారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా హెల్త్​ డిపార్ట్​మెంట్​ అంబులెన్సులను అందుబాటులో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని ఈవో శ్యామలరావు వెల్లడించారు.

వర్షం ఎంత కురిసిందో ఎలా తెలుస్తుంది? - ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్‌లకు అర్థం తెలుసా?

తుపాన్లకు ఆ పేర్లు ఎలా పెడతారు? - వాటి వెనుక ఉన్న స్టోరీ ఏంటో మీకు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details