EARLY Holi Celebrations 2024 :రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు హోలీ వేడుకలు సందడిగా సాగాయి. వీకెండ్ కావడంతో హైదరాబాద్‌లో ప్రత్యేక ఈవెంట్స్‌లు నిర్వహించారు. విద్యార్థులు, స్నేహితులంతా ఒక చోట చేరి ముందస్తూ సంబురాలు నిర్వహించారు. హైదరాబాద్ మోడల్స్ ఆధ్వర్యంలో కూకట్‌పల్లి వై జంక్షన్‌లోని హెచ్ఎండీఎ ప్లే గ్రౌండ్‌లో 'కంట్రీ క్లబ్ హోలీ' పేరుతో వేడుకలు నిర్వహించారు. సేంద్రీయ రంగులతో ఐదు గంటల పాటు సాగిన 'కంట్రీ క్లబ్ హోలీ' సంబరాల్లో(Holi celebrations) యువత పెద్ద సంఖ్యల్లో పాల్గొని జోష్‌గా రెయిన్ డాన్స్‌లు చేశారు. మ్యూజిక్ మస్తీలో ఉర్రూతలూగారు. ఆత్మీయులంతా ఒకరికొకరు రంగులు(Color) పూసుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఖమ్మంలో హోలీ వేడుకలు
పలు జిల్లాల్లో యువతీ, యువకులు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ జరుపుకున్నారు. ఖమ్మంలో ముందస్తు హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. ఓ ప్రైవేటు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డు సమీపంలోని గాయత్రి గ్రౌండ్స్‌లో వేడుకలు నిర్వహించారు. ఖమ్మం నగరానికి చెందిన యువతభారీ సంఖ్యలో హాజరయ్యారు. పాండిచ్చేరి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన డీజేల సంగీత శబ్ధాలతో ఉర్రూతలూగించించారు. నీటి జల్లులు ఏర్పాటు చేయడంతో డ్యాన్స్‌చేస్తూ ఉత్సాహంగా గడిపారు. రంగులు చల్లుకుంటూ కేరింతలు కోడుతూ ఆనందంగా గడిపారు. ఖమ్మం నగరంలో తొలిసారిగా ఇటువంటి ఈవెంట్(Event) ఏర్పాటు చేయడం పట్ల యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Holi Celebrations Hyderabad : హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో గార్డెన్ గ్యాలరీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో బీజేపీ(BJP) హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవిలత పాల్గొన్నారు. ఈ వేడుకల్లో రాజస్థానీ, మార్వాడీ కుటుంబాలు పాల్గొని ఉత్సాహంగా, సందడిగా ఒకరికొకరు రంగులు పూసుకోని నృత్యాలు చేస్తూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని మాధవిలత అన్నారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను మహేశ్వరీ సమాజ్ కాపాడుకుంటూ, ముందుకు తీసుకెళ్తుందన్నారు. హోలీలో రంగుల మాదిరిగా ప్రజలంతా ఒక్కటే అనే వేడుక ఈ హొలీ పండుగ అని ఆమె అన్నారు.