తెలంగాణ

telangana

ETV Bharat / state

బ్రిటన్​లో ఘనంగా దసరా వేడుకలు - ఆటపాటలతో ఉత్సాహంగా సాగిన సంబురాలు - DASARA CELEBRATIONS IN BRITAIN

బ్రిటన్‌లోని బ్రాక్నెల్ గ్యాంగ్‌ ఆధ్వర్యంలో దసరా సంబురాలు - ఆటపాటలతో ఉల్లాసంగా సాగిన వేడుకలు

Dasara Festival Celebrations in Britain
Dasara Festival Celebrations in Britain (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 14, 2024, 10:26 AM IST

Dasara Festival Celebrations in Britain :బ్రిటన్‌లోని బ్రాక్నెల్ నగర తెలుగు సంఘం "బ్రాక్నెల్ గ్యాంగ్" ఆధ్వర్యంలో స్థానిక బ్రేబ్రూక్ సభా మందిరంలో నిర్వహించిన దసరా సంబురాలు ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా ఘనంగా జరిగాయి. దసరా పండుగ సందర్భంగా చిరకాలంగా బ్రాక్నెల్ నగరంలో నివసిస్తున్న తెలుగు కుటుంబాల వారు కలిసి జరుపుకున్న ఈ సంబురాలు ఆట, పాటలతో, విందు భోజనాలతో ఎంతో ఉల్లాసంగా సాగాయి.

Dasara Festival Celebrations in Britain (ETV Bharat)

సభా నిర్వాహకులు దసరా ప్రాముఖ్యాన్ని స్కిట్ రూపంలో వివరించారు. పాత జ్ఞాపకాల శీర్షికన సాగిన ఈ సంబురాల్లో ప్రతి కుటుంబం వారు ప్రదర్శించిన చెరొక అలనాటి దూరదర్శన్ ప్రకటన, లఘు స్కిట్​ అందరినీ నవ్వుల్లో ముంచెత్తి అలరించాయి. చిన్నారులు నాట్యం ఆకట్టుకుంది. తదుపరి చిన్నా, పెద్ద అంతా కలిసి "హుక్ స్టెప్స్ ఛాలెంజ్"లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మాతృ దేశానికి దూరంగా ఉన్నా, గత 20 ఏళ్లుగా మన తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను తప్పకుండా ప్రతీ పండుగను అందరూ కలిసి జరుపుకోవడం విశేషం.

Dasara Festival Celebrations in Britain (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details