Cyber Crime in Hyderabad :సైబర్ నేరాల పట్ల ప్రజలను, పోలీసులు ఎంతగా అప్రమత్తం చేసినా, మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి. సైబర్ నేరస్థులు కొత్త కొత్త పద్దతుల్లో అమాయకులైన ప్రజల భయాన్ని, డబ్బుపై ఉన్న ఆశను ఆసరాగా చేసుకుని దోచేస్తున్నారు. నగరంలో ఫెడెక్స్ కొరియర్ పేరుతో మోసాలు(Cyber Crime) పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా సికింద్రాబాద్‌కు చెందిన సైబర్ బాధితుడి నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 9.69లక్షలు కాజేశారు. బ్యాంకాంక్ నుంచి మీ ఆధార్ నంబర్‌పై పార్శిల్ వచ్చిందని ఫెడెక్స్ నుంచి మాట్లాడుతున్నట్లు బాధితుడికి ఫోన్ చేశారు.
సదరు వ్యక్తి ఆధార్ నంబర్‌తో సహా తనపై ముంబై కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేశారని భయపెట్టారు. అలాగే అదే ఆధార్ నంబర్‌తో హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఖాతా తెరిచారని, అ ఖాతా మనీలాండరింగ్ యాక్ట్‌లో లింక్ అయి ఉందని తెలిపారు. కొద్ది సేపటి తర్వాత స్కైప్ ద్వారా సీబీఐ ఆధికారిలా ఫోన్ చేసిన నేరగాళ్లు, 17 మంది పిల్లలను కిడ్నాప్ చేసి వారి అవయవాలు అక్రమంగా తరలించిన వ్యవహారంలో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Telangana Crime News : కస్టమ్స్ అధికారులు సోదాలు చేసి మొత్తం కుటుంబాన్ని అరెస్ట్ చేయనున్నట్లు తెలిపారు. కేసు నమోదవకుండా ఉండాలంటే డబ్బులు పంపాలని, 12గంటల్లో నగదు మళ్లీ తిరిగి ఖాతాలో జమ అవుతాయని తెలిపారు. బాధితుడి తండ్రి క్యాన్సర్ పేషెంట్, భార్య ఆరు నెలల గర్భవతి కావడంతో భయాందోళనకు గురయ్యాడు. దీంతో నేరగాళ్ల చెప్పినట్లు చేశాడు. సదరు వ్యక్తులు తెలిపిన ఖాతాలకు బాధితుడు రూ. 9.69లక్షలు బదిలీ చేశాడు. అనంతరం ఎటువంటి స్పందన లేకపోవడంలో మోసపోయానని గ్రహించిన బాధితుడు, హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.