తెలంగాణ

telangana

ETV Bharat / state

India vs Pakistan : పెళ్లి వేడుకలో 'దాయాదుల' పోరు - ఆసక్తిగా వీక్షించిన బంధువులు - INDIA VS PAKISTAN AT WEDDING HALL

పెళ్లి వేడుకలో భారత్ ​- పాక్​ క్రికెట్​ మ్యాచ్​ లైవ్​ - పెళ్లి మండపంలో లైవ్​ ఏర్పాటు చేసిన వరుడు - పెళ్లి వీక్షించాల్సిన తెరపై క్రికెట్​ చూడటం ఆనందంగా ఉందన్న అతిథులు

Cricket Match Live At Wedding Hall
Cricket Match Live At Wedding Hall (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 23, 2025, 9:14 PM IST

Cricket Match Live At Wedding Hall : భారత్‌ - పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అనగానే ఎన్ని ముఖ్యమైన పనులున్నా క్రికెట్​ అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. ఈ మ్యాచ్‌ ప్రాధాన్యతను గుర్తించిన ఓ వరుడు (పెళ్లి కుమారుడు) తన స్నేహితుల కోసం పెళ్లి మండపంలోనే మ్యాచ్‌ లైవ్‌ చూసేందుకు ఏర్పాట్లు చేశాడు. దీంతో వివాహ వేడుకకు వచ్చిన అతిథులతో పాటు వరుడి స్నేహితులు కూడా మ్యాచ్​ను వీక్షించి ఆనందం వ్యక్తం చేశారు.

'దాయాదుల' పోరును ప్రత్యక్ష ప్రసారం :పూర్తి వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్​ జిల్లా భీంపూర్‌ మండలంలోని నిపాని గ్రామానికి చెందిన మస్కరి మణిశర్మ, సాయి ప్రియల వివాహ వేడుక ఆదిలాబాద్‌ పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం జరిగింది. అయితే ఆదివారం భారత్ ​- పాకిస్థాన్​ మ్యాచ్​ ఉండటంతో దాని ప్రాధాన్యతను గుర్తించిన వరుడు క్రికెట్​ మ్యాచ్​ లైవ్​ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే మండపంలో వివాహ వీడియో వీక్షించాల్సిన తెరపై 'దాయాదుల' పోరును ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసేందుకు తెరను ఏర్పాటు చేశారు. అటు స్నేహితుడి వివాహ వేడుకను ఇటు ఉత్కంఠ భరితంగా జరుగుతున్న క్రికెట్​ మ్యాచ్​ను ఒకే ప్రాంగణంలో చూడటం ఆనందంగా ఉందని పెళ్లి కుమారుడి స్నేహితులు తెలిపారు.

"ఈ రోజు మా ఫ్రెండ్ వివాహం జరిగింది. ఇదే రోజు ఇండియా పాకిస్థాన్ మ్యాచ్​ ఉండటం వల్ల పెళ్లికి వచ్చినటువంటి మా ఫ్రెండ్స్​ అందరం కలిసి మా స్నేహితుడు ఏర్పాటు చేసినటువంటి స్క్రీన్​పై మేమంతా క్రికెట్​ మ్యాచ్​ లైవ్​ను చూశాం. ఓ వైపు మా ఫ్రెండ్​ వివాహాన్ని మిస్సవ్వకుండా మరోవైపు క్రికెట్​ మ్యాచ్​ను కూడా చూడటం చాలా ఆనందాన్నిచ్చింది"- నిఖిల్​, వరుడి స్నేహితుడు

ఎక్కడ చూసినా క్రికెట్​ సందడే :ప్రస్తుత సీజన్​లో ఓవైపు పెళ్లిళ్లు, శుభకార్యాలు మరోవైపు క్రికెట్ మ్యాచ్​లు. శుభకార్యాలకు ఓవైపు హాజరవుతూనే మరోవైపు స్మార్ట్​ ఫోన్​లో దాయాదుల పోరును వీక్షిస్తున్నారు. ఐసీసీ టోర్నీ ఏదైనా అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసమే. క్రికెట్ ప్రపంచమంతా దృష్టి సారించే ఆ పోరు జరుగుతున్న వేళ క్రికెట్ అభిమానుల ఉత్కంఠ అంతా ఇంతా కాదు. ప్రతి బాల్, ప్రతి పరుగు, ప్రతిక్షణం వీక్షించేందుకు కుతుహలం చూపుతారు. సిద్దిపేట జిల్లాలో పలు వివాహ శుభకార్యాలలో పలువురు క్రీడాభిమానులు భారత్, పాకిస్థాన్​ల మధ్య జరుగుతున్న క్రికెట్ పోరును వీక్షిస్తున్నారు.

లైవ్‌ భారత్ x పాకిస్థాన్ - విరాట్ హాఫ్ సెంచరీ

ఇదేం అభిమానం గురూ.. క్రికెట్​ మ్యాచ్​ చూసేందుకు చెట్లు ఎక్కి మరీ!

పంచ కట్టులో అర్చకుల క్రికెట్.. సంస్కృత భాషలో కామెంటరీ

ABOUT THE AUTHOR

...view details