తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళా క్రికెటర్ గొంగడి త్రిషకు రూ.కోటి నజరానా - ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి - GONGADI TRISHA MEETS CM REVANTH

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన క్రికెటర్ గొంగడి త్రిష - ఐసీసీ అండర్ -19 వరల్డ్ కప్​లో సత్తా చాటినందుకు త్రిషను అభినందించిన సీఎం - రూ.కోటి నజరానా ప్రకటన

Gongadi Trisha Meets CM Revanth Reddy
Gongadi Trisha Meets CM Revanth Reddy (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2025, 3:29 PM IST

Gongadi Trisha Meets CM Revanth Reddy :భారత అండర్‌-19 మహిళా క్రికెటర్‌ గొంగడి త్రిషకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.కోటి నజరానా ప్రకటించారు. ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన త్రిష బుధవారం హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్‌లో రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా త్రిషకు సీఎం రూ.కోటి నజరానా ప్రకటించి జ్ఞాపికను అందజేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారత అండర్‌-19 క్రికెటర్‌ ధ్రుతి కేసరి, జట్టు చీఫ్‌ కోచ్‌ నౌషీన్, ట్రెయినర్‌ షాలినీలకు 10 లక్షల రూపాయల చొప్పున ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, త్రిష తండ్రి వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అసలు ఎవరీ గొంగడి త్రిష :మన రాష్ట్రంలోని భద్రాచలానికి చెందిన త్రిష గత కొంత కాలంగా అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్​లో స్థిరంగా రాణిస్తోంది. ప్రపంచ కప్​నకు ముందు జరిగిన ఆసియాకప్​లో 5 మ్యాచ్​లలో 53 సగటుతో 159 రన్స్ చేసి టాప్‌ స్కోరర్​గా నిలిచింది త్రిష. ఈ ఫామ్‌నే తాజా అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్​లోనూ కొనసాగించింది. 7 మ్యాచుల్లో ఏకంగా 309 పరుగులు చేసింది. దీంతో పాటు ఏడు వికెట్లను సైతం తీసింది. దీంతో 'ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌' సహా 'ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ' అవార్డులు త్రిషకు దక్కాయి. అండర్-19 ప్రపంచ కప్​లో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన గొంగడి త్రిషకు పలువురు అభినందనలు తెలిపారు.

తెలుగమ్మాయి 'త్రిష' ఆల్ రౌండ్​షో- రెండు అవార్డులు సొంతం- తండ్రికే అంకితం

ABOUT THE AUTHOR

...view details