CI Arrest in MLA Shakeel Son Case: మితిమీరిన వేగంతో ర్యాష్ డ్రైవింగ్(Rash Driving) చేస్తూ ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదానికి కారణమైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ కేసులో మాజీ ఇన్‌స్పెక్టర్ దుర్గారావును పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ11గా ఉన్న దుర్గారావు పరారీలో ఉండగా తెల్లవారు జామున ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే స్టేషన్లో రైలులో వెళ్తున్న ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.
ప్రజాభవన్ వద్ద కారుతో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి హల్చల్ - నిందితుడి కోసం పోలీసుల గాలింపు
Hit and Run Case Update News in Hyderabad :2023డిసెంబర్ 23 రాత్రి మూడు గంటల సమయంలో అతివేగంగా దూసుకెళ్లిన కారు ప్రజాభవన్ వద్ద ట్రాఫిక్ డివైడర్, బారీకేడ్లను ఢీకొట్టింది. ఆ రోజు రాత్రి విధుల్లో ఉన్న పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావు ఘటనాస్థలానికి వెళ్లారు. ఆ కారు బోధన్ మాజీ ఎమ్యెల్యే షకీల్(Bodhan EX MLA Shakil) తనయుడు సాహిల్ నడిపినట్టు గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో నలుగురు ప్రయాణించారని ధ్రువీకరించారు. నిందితుడు సాహిల్‌ను పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బ్రీత్ ఎనలైజర్‌తో నిందితుడిని పరీక్షించేందుకు పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
EX MLA Shakeel Son Sahil Case Update :పోలీస్ స్టేషన్ నుంచి రక్షకభటుల కన్నుగప్పి సాహిల్ తప్పించుకున్నాడు. నిందితుడు సాహిల్‌ను తప్పించేందుకు అప్పటి పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావు పూర్తిగా సహకరించారని బయటపడింది. ప్రజాభవన్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్(Panjagutta Police Station) వద్ద సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించిన ఉన్నతాధికారులు దీన్ని నమోదుచేసుకున్నారు. అంతర్గత విచారణలోనూ దుర్గారావు కేసును పక్కదారి పట్టించాడని, నిందితులను మార్చేందుకు పలువురితో ఫోన్‌లో మంతనాలు జరిపినట్టు నిర్దారించారు. దీంతో అతన్ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి దుర్గారావు పరారీలో ఉన్నారు. అతని కోసం ఐదు బృందాలుగా పోలీసులు గాలించారు.