కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వని ప్రధాని పెద్దన్న ఎలా అవుతారు : ఎమ్మెల్సీ కవిత BRS MLC Kavitha Fires On Congress : కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని ప్రధాని మోదీ పెద్దన్న ఎలా అవుతారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ప్రధానిని పెద్దన్న అని సీఎం రేవంత్ రెడ్డి అనడం మంచిదే అని కానీ, ఆ పెద్దన్న తెలంగాణకు ఏమీ చేయలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న బంధం బయట పడిందని కవిత వ్యాఖ్యానించారు. పెద్దన్న నుంచి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) ఉందని అన్నారు.ప్రజాప్రతినిధుల విషయమై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న కవిత, తీర్పును స్వాగతించిన ప్రధాని తెలంగాణ నుంచే ప్రారంభించాలని కోరారు.
తెలంగాణ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం : ప్రధాని మోదీ
MLC Kavitha Comments On Congress : ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి మొదటి ముద్దాయిగా ఉన్నారని, కేసును కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని కోరారు. సోనియాను బలిదేవత అన్న సీఎం ఇవాళ సోనియా, రాహుల్‌ను పోటీకి ఆహ్వానిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని గుర్తు పెట్టుకొని వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కాళేశ్వరం నుంచి నీరు ఇవ్వకుండా ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించిన కవిత (MLC Kavitha) నీళ్లు ఇచ్చే ఆస్కారం ఉండి ఇవ్వకపోవడం రైతులపై కక్ష సాధింపు మాత్రమేనని అన్నారు.
'కేంద్రంతో లొల్లి రాష్ట్రాభివృద్ధికి ఆటంకమే - తెలంగాణకు మోదీ పెద్దన్నలా సహకరించాలి'
జీఓ నంబర్ మూడును తక్షణమే రద్దు చేయాలి :
గురుకులాల ఉద్యోగాల నియామకాల్లో మహిళలకు కేవలం 12 శాతం ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని చాలా మంది ఆడబిడ్డలకు అన్యాయం జరిగినందున జీఓ నంబర్ మూడును తక్షణమే రద్దు చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల విషయంలో ఆడబిడ్డలకు అన్యాయం చేయవద్దని గతంలోనే కోరామని 626 ఉద్యోగాల్లో కేవలం 77 మాత్రమే ఆడబిడ్డలకు వచ్చాయని వివరించారు. 33 శాతానికి పైగా ఆడబిడ్డలకు ఉద్యోగాలు రావాల్సింది పోయి 12 శాతం మాత్రమే వస్తున్నాయని ఎమ్మెల్సీ ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసిందని, మహిళలకు అన్యాయం చేయబోమని కేసీఆర్ అప్పీలుకు వెళ్లారని గుర్తు చేశారు.
"గురుకుల ఉద్యోగాల నియామకాల్లో చేరే మహిళలకు అన్యాయం చేస్తున్నటు వంటి జీవో నంబరు ముడును కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం రద్దు చేయాలి. ప్రభత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల విషయంలో ఆన్యాయం చేయవద్దని గతంలో కోరాం. మహిళ రిజర్వేషన్ల విషయంలో ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసింది. మార్చి 8న ధర్నా చౌక్‌లో నల్ల రిబ్బన్లతో నిరసన చెపడుతాం. ప్రధాన మంత్రిని పెద్దన్నగా రేవంత్ రెడ్డి అభివర్ణించడం మంచిదే కాని, కేెంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి కేటాయించలేదు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించకపోవడం అన్యాయం, కాంగ్రెస్, బీజేపీ రెండు ఒకటే"-ఎమ్మెల్సీ కవిత
BRS MLC Kavitha :కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై భారత జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదో తేదీన ధర్నా చౌక్‌లో నిరసన వ్యక్తం చేయనున్నట్లు కవిత ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపనున్నట్లు తెలిపారు. మార్చ్ ఎనిమిదో తేదీన జరిగిన ధర్నాకు మిగతా వాళ్లు కూడా కలిసి రావాలని కోరారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఇస్తున్న ఉద్యోగ నియామకాలు అన్నీ కేసీఆర్ చేపట్టినవేనని రేవంత్ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్ డీఎస్సీ మాత్రమేనని చెప్పారు. గురుకుల నియామకాలను ఆరోహణా క్రమంలో నింపడం సరికాదని అన్నారు.
ఒకే వేదికపై పీఎం మోదీ, సీఎం రేవంత్ - కోలాహలంగా మారనున్న ఆదిలాబాద్ బహిరంగ సభ
'కాళేశ్వరం విషయంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు - ప్రభుత్వం మారినా పాలనలో మార్పు లేదు'