How to Apply for Mee Seva Login ID : విద్యార్థులు, పౌరులు, రైతులు ఎవరైనా సరే.. ఏదైనా సర్టిఫికెట్ కావాలంటే దగ్గరలోని "మీ సేవ" కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సిందే. అయితే.. అంత దూరం వెళ్లాల్సిన పని లేకుండా.. కేవలం ఇంట్లో ఉండే మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా సులభంగా పలు దరఖాస్తులు చేసుకోవచ్చు. మరి, అది ఎలా సాధ్యమవుతుంది? ఎలాంటి సేవలు పొందవచ్చు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
సిటిజన్ లాగిన్ ఐడీ : గతంలో మీ సేవ ఆపరేటర్లకు మాత్రమే లాగిన్ ఐడీలు ఉండేవి. అంటే.. ఆ సెంటర్ల నిర్వాహకులు మాత్రమే ఆ సేవలు అందించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. "మీ సేవ" ద్వారా కావాల్సిన పనులు చేసుకునేందుకు అందరికీ అవకాశం కల్పించారు. అదే.. "సిటిజన్ లాగిన్". ఈ లాగిన్ ఐడీ ద్వారా చాలా వరకు పనులు ఇంట్లో నుంచే చేసుకోవచ్చు. ఆ ఐడీ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.
- ముందుగా తెలంగాణ మీ సేవ అధికారక వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. https://meeseva.telangana.gov.in/meeseva/home.htm
- హోమ్ పేజీలో కుడివైపున కనిపించే Login కాలమ్లో New User ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- అప్పుడు మీకు స్క్రీన్ మీద రిజిస్ట్రేషన్ ఫారమ్ కనిపిస్తుంది. అందులో మొబైల్ నెంబర్, పాస్వర్డ్, పేరు, ఈమెయిల్, అడ్రస్ సహా తదితర వివరాలు ఎంటర్ చేసి Submit ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి Submit చేస్తే మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మీ లాగిన్ వివరాలు సేవ్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఈ లాగిన్ ఐడీ ఉపయోగించి మీకు కావాల్సిన సేవలు పొందాలి.
ఎలా లాగిన్ కావాలంటే:
- ముందుగా తెలంగాణ మీ సేవ అధికారక వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. https://meeseva.telangana.gov.in/meeseva/home.htm
- హోమ్ పేజీలో కుడివైపున కనిపించే Login కాలమ్లో రిజిస్ట్రేషన్ సమయంలో మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్, క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి Login ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది.
- దానిని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే స్క్రీన్ మీద పలు రకాల సేవలు కనిపిస్తాయి.
- అందులో మీకు కావాల్సిన సేవలు మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు.
లాగిన్ ఐడీ పొందిన తర్వాత లభించే సేవలు:
- TSRTA
- రెవెన్యూ
- జీహెచ్ఎంసీ
- సీడీఎంఏ
- టీజీఎస్పీడీసీఎల్
- గ్రామీణాభివృద్ధికి సంబంధించిన సేవలు
- పోలీసు శాఖకు సంబంధించిన సేవలు
- విద్యకు సంబంధించిన సేవలు సహా పలు ఇతర సేవలు కూడా లభిస్తాయి.
ఊళ్లోనే సొంత బిజినెస్ - మీరు ఆధార్ సెంటర్ నడిపిస్తారా? - పర్మిషన్ ఇలా తెచ్చుకోండి!
ఒంటరి మహిళలకు నెలకు రూ. 2 వేల ఆర్థిక సాయం - ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా?
రైతులకు "వ్యయసాయ ఆదాయ ధ్రువీకరణ పత్రం" - ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా?