BRS MLA Harish Rao Letter To CM Revanth : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫీజులను భారీగా పెంచడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించడం విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేయడమేనని మాజీ మంత్రి హరీశ్ రావు ఆక్షేపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. అనేక కష్టాలకు ఓర్చి ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్దమయ్యే విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం బాధాకరమన్న ఆయన, దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
అద్భుతమైన తెలంగాణ - 100 రోజుల్లోనే అస్తవ్యస్తమవుతుందని భావించలేదు : కేసీఆర్ - KCR Fires on Congress
BRS MLA Harish Rao Letter On Increasing Tet Exams Fees : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టెట్ ఒక పేపర్ రాసినా, రెండు పేపర్లు రాసినా ఫీజు రూ.400లు మాత్రమే అన్న హరీశ్ రావు, ఇప్పుడు టెట్ ఒక పేపర్‌కు రూ.1,000, రెండు పేపర్లకు రూ.2,000 ఫీజుగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. సీబీఎస్‌ఈ నిర్వహించే సీ టెట్‌తో పోల్చితే, టెట్ ఫీజులు రెట్టింపుగా ఉన్నాయని పేర్కొన్నారు. రిజర్వుడ్ విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పించకుండా జనరల్ కేటగిరీ విద్యార్థులతో సమానంగా ఒకే తరహా ఫీజులను అమలు చేయడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని ఆక్షేపించారు. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సీ-టెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు సీబీఎస్‌ఈ ఫీజు రాయితీని అమలు చేస్తున్నారని కానీ, టెట్‌లో మాత్రం తెలంగాణ ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదని అన్నారు.