BJP Leader Raghunandan Rao Fires on Congress :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి2014 నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు భూములపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రఘునందర్ రావు సవాల్ విసిరారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, సరైన నిర్ణయాలు తీసుకోలేక ఊగిసలాడుతోందన్నారు. ఆట మొదలైందని మంత్రులు లీక్‌లు ఇస్తున్నారు తప్పితే, తప్పుడు పనులు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సంబంధం లేకపోతే గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన బ్యూరో క్రాట్స్పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేనతో పొత్తు ఉండదు : ఎంపీ లక్ష్మణ్
'మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ సతీమణి పేరు మీద 25 ఎకరాల భూమి రిజిస్టర్ అయ్యింది. ధరణి పేరుతో సోమేశ్ కుమార్ 25 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎందుకు కేసు నమోదు చేయడం లేదు. హేటిరో సంస్థకు ఇచ్చిన భూమి అక్రమమని తెలుసుకున్నప్పుడు, ఎందుకు కేసులు పెట్టి చర్యలు తీసుకోవడం లేదు. డీజీపీ మహేందర్ రెడ్డి అంతు చూస్తానని రేవంత్ రెడ్డి పదే పదే చెప్పారు. ఇప్పుడు మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్సీ ఛైర్మన్ అయ్యారు.' అని రఘునందన్ రావు అన్నారు.
హరీశ్‌రావు అండదండలతోనే సీఎం రేవంత్‌తో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల భేటీ