SI Died in Mulugu District : ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో ఏఆర్ ఎస్సై స్వర్ణపాక లక్ష్మీ నర్సు (38) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం తను ఉండే నివాసంలోనే ఉరి వేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం పోలీస్ స్టేషన్లో ఏఆర్ ఎస్సైగా పనిచేస్తున్న స్వర్ణపాక లక్ష్మీ నర్సు స్వస్థలం అదే జిల్లా ఇల్లందు మండలం మాణిక్యపురం.
మృతుడి భార్య సునీత గోవిందరావుపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.