AP Dy CM Pawan Kalyan On Allu Arjun Issue :అల్లు అర్జున్ వివాదంపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకు తెచ్చారని అన్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ ఛైర్మన్ దిల్‌రాజు పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన కిందిస్థాయి నుంచి ఎదిగారని అన్నారు.
వైఎస్సార్సీపీ విధానాల తరహాలో తెలంగాణలో వ్యవహరించలేదని పవన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో బెనిఫిట్ షోలకు రేవంత్ రెడ్డి అవకాశం కల్పించారని గుర్తు చేశారు. టికెట్ ధరలు పెంపునకు కూడా అవకాశం కల్పించారని పవన్ కల్యాణ్ అన్నారు. అభిమాని చనిపోతే వెంటనే పరామర్శకు వెళ్లి ఉండాల్సిందని పవన్ అభిప్రాయపడ్డారు. అల్లు అర్జున్ కాకున్నా కనీసం నిర్మాతలైనా వెళ్లి ఉండాల్సిందన్నారు.
" గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారు. రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు. కిందిస్థాయి నుంచి ఎదిగారు. వైఎస్సార్సీపీ విధానాల తరహాలో తెలంగాణలో వ్యవహరించలేదు. రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చారు. టిక్కెట్ ధర పెంపునకు అవకాశమిచ్చారు. అల్లు అర్జున్ విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు. తెర ముందు, వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. ఇలాంటి ఘటనల్లో నేను పోలీసులను తప్పుపట్టను" - పవన్ కల్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం