Another Case on Former EX DCP Radhakishan Rao :హైదరాబాద్‌కు చెందిన చెన్నుపాటి వేణుమాధవ్ హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసి ప్రపంచ బ్యాంకులో పనిచేశారు. భారత్‌కు తిరిగొచ్చి 2011లో క్రియా హెల్త్ కేర్ సంస్థను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఖమ్మం జిల్లాలో టెలీమెడిసిన్, జాతీయ రహదారి అత్యవసర వాహనాల సేవలు అందించే ఈ సంస్థ మొత్తం రూ.250 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టింది.
Case Against Task Force EX OSD Radhakishan Rao :ఈ సంస్థలో ఇద్దరు శాశ్వత డైరెక్టర్లుగా వేణుమాధవ్, బాలాజీ, నలుగురు తాత్కాలిక డైరెక్టర్లుగా గోపాల్, రాజ్, నవీన్, రవి ఉన్నారు. దీనికి బాలాజీ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 2016-17 నాటికి సంస్థలో వేణుకు 60 శాతం, బాలాజీకి 20 శాతం, గోపాల్‌కు 10 శాతం, రాజ్‌కు-10 శాతం వాటాలున్నాయి. 2018లో నలుగురు తాత్కాలిక డైరెక్టర్లయిన వారు వేణుమాధవ్ పేరిట ఉన్న 60 శాతం షేర్లను తక్కువ ధరకు విక్రయించాలని సంస్థను పూర్తిగా తామే నడిపించుకుంటామని ఆయనపై ఒత్తిడి చేశారు.
ప్లేటు ఫిరాయించిన చంద్రశేఖర్ వేగె : ఇదే సమయంలో గోల్డ్‌షిఫ్ అబోడే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈవో చంద్రశేఖర్ వేగె వేణుమాధవ్‌కు పరిచయమయ్యారు. తాత్కాలిక డైరెక్టర్లు షేర్లు విక్రయించాలంటూ ఒత్తిడి తెస్తున్న విషయాన్ని ఆయన అతనితో ప్రస్తావించారు. క్రియా హెల్త్ కేర్ సంస్థలో తాను షేర్‌హోల్డర్‌గా మారితే నలుగురు తాత్కాలిక డైరెక్టర్లతో బేరసారాలు నడిపేందుకు అవకాశముంటుందని చంద్రశేఖర్ వేగె వేణుకు చెప్పాడు. ఇందుకు అంగీకరించిన వేణుమాధవ్ మొత్తం రూ.40 కోట్ల విలువ చేసే 4 లక్షల షేర్లను చంద్రశేఖర్ పేరిట బదిలీ చేశారు. ఆ తర్వాత చంద్రశేఖర్ ప్లేటు ఫిరాయించి తాత్కాలిక డైరెక్టర్లతో కుమ్మక్కయినట్లు ఫిర్యాదులో వేణుమాధవ్ పేర్కొన్నారు.
డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి పథకం :తాత్కాలిక డైరెక్టర్ల వేధింపులు ఎక్కువయ్యాయంటూ 2018 అక్టోబరు 3న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వేణుమాధవ్ ఫిర్యాదు చేశారు. కొన్ని రోజుల తర్వాత షేర్లు బదలాయించడం లేదని ఆరోపిస్తూ అక్టోబరులో, తాత్కాలిక డైరెక్టర్లు కూడా వేణుపై ఫిర్యాదు చేశారు. తొలుత తాను ఇచ్చిన ఫిర్యాదు పట్టించుకోకపోవడం లేదంటూ ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత చంద్రశేఖర్ వేగె, గోపాల్, రాజ్, నవీన్, రవి తదితరులు అప్పటి టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావుతో(Police Case on Radhakishan Rao)కలిసి బలవంతంగా షేర్లు బదిలీ చేయించుకోవాలని పథకం వేశారని తాజాగా ఇచ్చిన ఫిర్యాదులో వేణుమాధవ్ తెలిపారు.
2018 నవంబరు 22న ఉదయం ఖాజాగూడ వద్ద ద్విచక్రవాహనాలపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు తనను అడ్డగించి తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమని దాడి చేశారని వేణుమాధవ్ ఫిర్యాదులో వివరించారు. అక్కడ్నుంచి బలవంతంగా టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లారని అప్పటికే చంద్రశేఖర్, తాత్కాలిక డైరెక్టర్లతోపాటు పూర్ణచందర్‌రావు అనే మరో వ్యక్తి అక్కడికి చేరుకున్నారు. వంద కోట్ల విలువైన కంపెనీ వాటాను చట్టవిరుద్ధంగా బదిలీ చేయాలని బెదిరించడం దారుణమని వారికి చెప్పానని వేణు ఫిర్యాదులో పేర్కొన్నారు.