తెలంగాణ

telangana

ETV Bharat / state

'నన్ను, నా ఫ్యామిలీని చంపుతానంటున్నాడు' : హైదరాబాద్​ పోలీసులను ఆశ్రయించిన నిధి అగర్వాల్ - ACTRESS NIDHHI AGERWAL COMPLAINT

సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ కథానాయిక నిధి అగర్వాల్ - తనను సోషల్ మీడియాలో వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు

Actress Nidhhi Agerwal
Actress Nidhhi Agerwal Complaint Cybercrime (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 19 hours ago

Updated : 19 hours ago

Actress Nidhhi Agerwal Complaint Cybercrime :ప్రముఖ కథానాయిక నిధి అగర్వాల్ హైదరాబాద్​లోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి తనను సోషల్ మీడియాలో వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ వ్యక్తి తనను, తన కుటుంబాన్ని చంపుతానని బెదిరిస్తున్నాడని తెలిపింది. అసభ్యకర మెసేజ్​లతో తన ఇన్​స్టా అకౌంట్​కి పదేపదే ట్యాగ్ చేస్తున్నాడని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బెదిరింపులతో మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నా : ఆ వ్యక్తి బెదిరింపుల వల్ల తాను, తన కుటుంబం మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నామని సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నిధి అగర్వాల్ పేర్కొంది. నిందితుడిని గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిధి అగర్వాల్ పోలీసులను కోరింది. ఈ మేరకు స్పందించిన పోలీసులు నిధి అగర్వాల్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రెండు భారీ సినిమాల్లో హీరోయిన్​గా నిధి :ప్రస్తుతం హీరోయిన్ నిధి అగర్వాల్ ఇద్దరు అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. పవన్‌ సరసన ‘హరిహర వీరమల్లు’లో, ప్రభాస్‌ ‘రాజా సాబ్‌'లోనూ నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా వారిలో జోష్ నింపేలా నిధి ఓ ఆసక్తికర విషయం పోస్ట్‌ చేశారు. ఒకే రోజు ఈ రెండు సినిమాల షూటింగ్‌లలో పాల్గొన్నట్లు తెలిపారు.

ఈ ఏడాదిలో రెండు సినిమాలు విడుదల : ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ ఏపీలోని విజయవాడలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రమిది. క్రిష్‌ సారథ్యంలో జ్యోతికృష్ణ దర్శకత్వంలో రానుంది. ఈ ఏడాది మార్చిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో పవన్‌ పేదల పక్షాన పోరాడే యోధుడిగా కనిపించనున్నారు. ‘రాజాసాబ్‌’ విషయానికొస్తే మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న హారర్‌ రొమాంటిక్‌ కామెడీ చిత్రమిది. ఈ సినిమా వరుస అప్‌డేట్‌లతో సందడి చేస్తుంది. ఈ ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

'నన్ను నమ్మండి' - లీక్డ్​ ఫొటోపై 'రాజాసాబ్' బ్యూటీ నిధి అగర్వాల్​ రియాక్షన్

అందాల నిధి.. ఏ తోటలో పండిన పండో

Last Updated : 19 hours ago

ABOUT THE AUTHOR

...view details