మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - ముందస్తు బెయిల్ మంజూరు - MOHAN BABU ANTICIPATORY BAIL
సినీనటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
![మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - ముందస్తు బెయిల్ మంజూరు mohan babu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-02-2025/1200-675-23533598-thumbnail-16x9-bail.jpg)
Published : Feb 13, 2025, 11:27 AM IST
|Updated : Feb 13, 2025, 11:47 AM IST
Mohan Babu on Supreme Court : సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మోహన్‌బాబుకు ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. జర్నలిస్ట్‌పై దాడి వ్యవహారంలో తెలంగాణ పోలీసులు మోహన్‌బాబుపై కేసు నమోదు చేశారు. దీంతో మోహన్‌బాబు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు మోహన్‌బాబుకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.