తెలంగాణ

telangana

ETV Bharat / state

సగం స్థలం చొప్పున నష్టపోతున్న బాలకృష్ణ, జానారెడ్డి - ఎందుకో తెలుసా? - BALAYYA AND JANA REDDY HOUSE MARKS

బాలకృష్ణ ఇంటికి రెండు వైపులా భూసేకరణ - అదే విధంగా జానారెడ్డి రెండు ప్లాట్లులో సగం స్థలం - కేబీఆర్​ పార్క్ విస్తరణకు భూ సేకరణ

Balakrishna and Jana Reddy House Marks
Balakrishna and Jana Reddy House Marks (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 6 hours ago

Balakrishna and Jana Reddy House Marks :జూబ్లీహిల్స్​ మహారాజ అగ్రసేన్​ కూడలి నుంచి చెక్​పోస్టు వరకు కేబీఆర్​ పార్కు హద్దు పొడవునా రోడ్డు విస్తరణ పనులు, పార్కు చుట్టూ ఉన్న ఆరు కూడళ్ల అభివృద్ధి పనులతో పలువురు ప్రముఖులు భూముల కోల్పోనున్నారు. దీంతో వారంతా తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నేత జానారెడ్డి, అల్లు అర్జున్​ మామ కె.చంద్రశేఖర్​ రెడ్డి, రెండు మీడియా సంస్థల యజమానులు, పలువురు బడా వ్యాపారులు భూమిని కోల్పోతున్నారు. అభివృద్ధి పనుల్లో ఎంతవారైనా వాటిని ముందుకు తీసుకెళ్లడంపైనే రాష్ట్రప్రభుత్వం పట్టుదలతో ఉంది. అధికారులు మాత్రం, బాధితులందరికీ నచ్చజెప్పి భూసేకరణకు ఒప్పిస్తుందని చెబుతున్నారు.

జాతీయ ఉద్యానవనం : కేజీఆర్​ పార్క్ జాతీయ ఉద్యానవనం కావడంతో హద్దు పొడవునా కొంత భూమి ఎకో సెన్సిటివ్​ జోన్​గా ఉంటుంది. బీఆర్​ఎస్​ సర్కారు ఎస్సార్డీపీ పేరుతో 2016లో కేబీఆర్​ పార్కు చుట్టూ పైవంతెనలు నిర్మించేందుకు ప్రయత్నించింది. దీంతో ఆయా పైవంతెనల పిల్లర్లు ఎకో సెన్సిటివ్​ జోన్​లో నిర్మిస్తున్నారంటూ పర్యావరణవేత్తలు ఎన్జీటీని ఆశ్రయించారు. అనంతరం ప్రాజెక్టును రద్దు చేయించారు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్​ ప్రభుత్వం డిజైన్లను మార్చి ఎకో సెన్సిటివ్​ జోన్​ను తాకకుండా నిర్మాణాలను చేపట్టాలని చూస్తోంది. దీంతో నిర్మాణాలను రోడ్డు వైపున చేపట్టాలని, అవసరమైన చోట ప్రైవేటు ఆస్తులను సేకరించాలని నిర్ణయించింది.

రూ.1200 కోట్లతో పనులు ప్రారంభం : బసవతారకం క్యాన్సర్​ ఆసుపత్రి, మహారాజ అగ్రసేన్​, ఫిల్మ్​నగర్​, జూబ్లీహిల్స్ రోడ్డు నం.45, చెక్​పోస్టు, కేబీఆర్​ పార్కు ప్రధాన గేటు కూడళ్లలో ఏడు ఉక్కు వంతెనలు, ఆరు అండర్​పాస్​లను నిర్మించే పనుల్లో వేగం పెంచింది. ఇందుకు రూ.1200 కోట్లను కేటాయించింది.

స్థలాలు కోల్పోతున్న ప్రముఖులు :

  • ఎమ్మెల్యే బాలకృష్ణ ఇల్లు రోడ్డు నం.45, 92 కూడలి వద్ద ఉంది. దీంతో రెండు వైపులా భూసేకరణ చేపట్టాల్సి ఉంది. దాదాపు సగం భూమిని బాలకృష్ణ నష్టపోతారని అంచనా.
  • ఒమేగా ఆసుపత్రి సమీపంలో జానారెడ్డికి సంబంధించిన రెండు ప్లాట్లు ఉన్నాయి. ఆ రెండు ప్లాట్లను 43 అడుగుల మేర రోడ్డు కోసం సేకరించాల్సి వస్తోంది. దీంతో ఆయన దాదాపు 700 గజాలు నష్టపోవచ్చని తెలుస్తోంది.

బంజారాహిల్స్​ నుంచి జూబ్లీహిల్స్​ చెక్​పోస్టు వరకు రోడ్డు విస్తరణ :

  • ప్రాజెక్టు వ్యయం - రూ.150 కోట్లు
  • రోడ్డు పొడవు - 6.5 కి.మీ
  • గుర్తించిన నిర్మాణాలు - 306
  • సర్వే పూర్తయినవి - 86

కేబీఆర్​ పార్కు ట్రాఫిక్​ కష్టాలకు ఇక సెలవు​! - రూ.826 కోట్లతో ఆ ఆరు జంక్షన్ల ఆధునీకరణకు ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్ - KBR PARK JUNCTIONs DEVELOPMENT

చూడ్డానికి రెండు కళ్లు చాలని కొత్వాల్​గూడ ఎకో పార్క్​ - వారెవ్వా! ఏంటి బ్రో ఆ సదుపాయాలు

ABOUT THE AUTHOR

...view details