TELANGANA WEATHER REPORT TODAY : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశలో కదిలి ఈ నెల 24వ తేదీన మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాత ఇది ఈశాన్య దిశవైపుగా ప్రయాణిస్తూ మరింత బలపడి ఎల్లుండి ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తుపాన్‌గా మారుతుందని పేర్కొంది.
తుపానుగా మారే అవకాశం :ఈ తుపాన్ ఉత్తర దిశలో కదులుతూ మరింత బలపడి తీవ్ర తుపాన్‌గా మారి ఈ నెల 26వ తేదీ నాటికి బంగ్లాదేశ్‌ను అనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకునే అవకాశముందని వాతావరణశాఖ వివరించింది. ఇదిలా ఉంటే నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం అండమాన్ నికోబార్ దీవుల్లోని మిగిలిన ప్రాంతం ఉత్తర మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి రాగాల రెండు రోజుల్లో విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
Rains in the state today tomorrow :నేడు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇదే సమయంలో గంటకు 30నుంచి 40కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వివరించింది.
హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం - వాహనదారులకు తప్పని ట్రాఫిక్ తిప్పలు - Telangana Rains Report